విస్తరిస్తోన్న క్షయ
జిల్లాలో క్రమంగా పెరుగుతున్న బాధితులు
●
అవగాహన కల్పిస్తున్నాం..
జిల్లాలో క్షయ బాధితులు కొంత తగ్గుముఖం పట్టారు. అన్ని పీహెచ్‌సీల్లో మైక్రోస్కోపీ మిషన్, టీబీ సెంటర్, జడ్చర్ల, ఎస్‌వీఎస్‌లో న్యాట్ మిషన్స్ ద్వారా పరీక్షలు చేస్తున్నాం. ఈ పరీక్ష ఫలితాలు త్వరగా వస్తాయి. జిల్లాలో ఆశల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా పనితీరు బాగుందని రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి వచ్చింది.
– మల్లికార్జున్,
జిల్లా క్షయ నియంత్రణ అధికారి
నిర్లక్ష్యం చేయొద్దు
రెండు వారాల పాటు క్రమం తప్పకుండా దగ్గు, జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా తప్పక తెమడ పరీక్ష, ఎక్స్‌రే తీయించి వైద్యుడికి చూపించాలి. టీబీ సోకిన వారు మందులు వాడకుండా మధ్యలో ఆపేస్తున్నారు. పల్లెల్లో ఆర్‌ఎంపీలు అప్పటి పూర్తిగా దగ్గు, జ్వరానికి తాత్కాలిక మందులు ఇచ్చి సంబంధిత వైద్యుడి దగ్గరకు రాకుండా చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే ఇతర కుటుంబ సభ్యులకు వచ్చే అవకాశం ఉంది.
– డాక్టర్ సందీప్‌కుమార్, పల్మనాలజిస్ట్
పాలమూరు: క్షయ నివారణ కట్టడి కోసం జిల్లా అధికారులు ఒకవైపు ప్రయత్నిస్తున్నా.. మరోవైపు రోగులు క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో చిన్నారుల్లోనూ ఈ వ్యాధి అధికంగా కనిపిస్తోంది. ఈ ఏడాది కేటాయించిన లక్ష్యంలో భాగంగా బాధితులను గుర్తించడానికి ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారు. అయితే కొత్తగా క్షయ బాధితులకు పోషకాహార కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఇప్పటి వరకు జిల్లాలో 125 మందికి కిట్లు అందజేశారు. ఇందులో 3 కిలోల బియ్యం, కిలో పల్లీలు, కిలో పాల పౌడర్, నాలుగు రకాల పప్పు ధాన్యాలు, ఒక ఆయిల్ పాకెట్ అందిస్తున్నారు.
నిబంధనలు పాటించరు..
జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యులు క్షయ బాధితులను గుర్తిస్తే వారి వివరాలు ప్రతినెల క్షయ నియంత్రణ శాఖకు అందించాలి. ఒక కేసును గుర్తిస్తే ప్రభుత్వం సదరు వైద్యుడికి రూ.100 ప్రోత్సహక నగదు అందిస్తుంది. బాధితుడికి ఐదు నెలలపాటు పూర్తిస్థాయిలో చికిత్స అందిస్తే రూ.500 చెల్లిస్తోంది. అయినా ప్రైవేట్ వైద్యులు వివరాలు అందించడం లేదు. ప్రైవేట్‌లో చికిత్స తీసుకోకపోవడంతో అది వారి నుంచి ఇతరులకు సోకి మరింతగా ప్రబలుతోంది. బాధితుల వివరాలన్నీ ఈ శాఖ వద్ద ఉన్నట్లయితే సిబ్బంది ఆ రోగుల వివరాల మేరకు చికిత్స తీసుకుంటున్నారా.. లేదా.. అనే విషయాలను పర్యవేక్షించి అవగాహన కల్పించి వ్యాధి నివారణకు కృషి చేయడానికి వీలవుతుంది.
వ్యాధిని గుర్తించడం ఇలా..
రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం వేళల్లో జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఛాతిలో నొప్పి, దగ్గినప్పుడు రక్తం పడటం టీబీ వ్యాధి లక్షణాలు. సమీపంలోని అరోగ్య కేంద్రాలకు వెళ్తే ఉచితంగా తెమడ పరీక్ష చేసి వ్యాధిని గుర్తిస్తారు.
శరీరంలో అన్ని అవయవాలకు..
క్షయ ఒక అంటువ్యాది. ఇది మైక్రో బ్యాక్టీరియం ట్యూబర్ క్యూలోసిన్ అనే బ్యాక్టీరియా సోకినప్పుడు వ్యాపిస్తుంది. వెంట్రుకలు, గోళ్లు, తప్ప మిగిలిన అన్ని అవయవాల్లోనూ నివసించే ప్రమాదకరమైన సూక్ష్మ క్రిమి ఇది. ఈ బ్యాక్టీరియా అధికంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి భయంకరమైన వ్యాధికారక క్రిమి గాలి పీల్చుకున్నప్పుడు దేహంలోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా వ్యాధికారక క్రిమి 90 శాతం మందిలో క్రియా రహితంగా ఉంటుంది. పొగరాయుళ్లు, మద్యపాన ప్రియులు, హెచ్‌ఐవీ బాధితులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నప్పుడు వ్యాధి ప్రబలుతుంది.
చిన్నారులను కలవరపెడుతున్న మహమ్మారి
అవగాహనతోనే
అరికట్టేందుకు అవకాశం
నేడు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం
విస్తరిస్తోన్న క్షయ
విస్తరిస్తోన్న క్షయ
విస్తరిస్తోన్న క్షయ
Comments
Please login to add a commentAdd a comment