ఆశలు ఆవిరి | - | Sakshi
Sakshi News home page

ఆశలు ఆవిరి

Published Mon, Mar 24 2025 2:12 AM | Last Updated on Mon, Mar 24 2025 2:13 AM

ఆశలు

ఆశలు ఆవిరి

నెర్రెలు బారిన పొలాలు.. పశువుల మేతగా మారిన పంటలతో వ్యవసాయ పొలాలు కళ తప్పాయి. ఆరుగాలం కష్టించి పంటలు పండించే అన్నదాతలను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. యాసంగి సీజన్‌లో వ్యయ ప్రయాసాలకోర్చి పంటలు సాగుచేసిన రైతన్నలకు కన్నీరే మిగులుతోంది. పంటలకు నీరందించే బోరుబావుల్లో భూగర్భజలాలు పడిపోవడం.. కరెంటు సక్రమంగా లేకపోవడం.. కాల్వలకు నీటి విడుదల నిలిచిపోవడం తదితర కారణాలతో రైతుల కళ్లెదుటే పంటలు ఎండిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు. పంటసాగుకు చేసిన అప్పులను ఎలా తీర్చాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పంటలు ఎండిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. – సాక్షి నెట్‌వర్క్‌

వాబుపేట మండలం కామారం గ్రామానికి చెందిన రైతు గోరుగాని చంద్రయ్య తనకున్న మూడెకరాల్లో వరిపంట సాగు కోసం రూ.లక్ష ఖర్చుచేసి రెండు బోర్లు డ్రిల్లింగ్‌ చేయిస్తే ఒక్క బోరులో నీరు వచ్చింది. దీంతో పంటసాగు చేశాడు. తీరా వేసవి ప్రారంభంలోనే బోరుబావిలో నీటిమట్టం పడిపోవడంతో ఎకరా పంటకు నీరందడం కష్టంగా మారింది. రెండెకరాల వరిపొలం రైతు కళ్లెదుటే ఎండింది. బోరుడ్రిల్లింగ్‌, పంటసాగుకు తెచ్చిన

వాబుపేట మండలం పల్లెగడ్డకు చెందిన రైతు రామయ్య నాలుగెకరాల్లో వరిసాగు చేశారు. నారు పోసే సమయంలో బోర్లు బాగానే ఉన్నా.. ప్రస్తుతం రెండు బోర్లు కలిసి ఎకరం కూడా సరిగ్గా పారడం లేదు. పంట మొత్తం పూర్తిగా ఎండిపోయింది. సదరు రైతుకు దాదాపు రూ. 2లక్షలకు పైగా అప్పులు మిగలాయి. బోర్లను నమ్ముకుని వరిసాగు చేస్తే అప్పులే మిగిలాయని రైతు రామయ్య రోదిస్తున్నారు.

కౌకుంట్ల మండలం దాసరిపల్లికి చెందిన రైతు శ్రీకాంత్‌రెడ్డి బోరుబావి ఆధారంగా నాలుగెకరాల్లో వరిసాగు చేశారు. బోరుబావిలో నీటిమట్టం పడిపోవడంతో పంటకు నీరందించే పరిస్థితి లేకుండాపోయింది. రైతు కళ్లెదుటే పంట మొత్తం ఎండిపోయింది. పశువుల మేతగా మారిన పంటను చేస్తే కన్నీరు ఆగడం లేదని రైతు వాపోయారు. పంట పెట్టుబడి కోసం తెచ్చిన రూ. లక్షకు పైగా అప్పు ఎలా కట్టాలో తెలియడం లేదని ఆవేదన చెందుతున్నారు.

ఖిల్లాఘనపురం మండలం ముందరితండాకు చెందిన రైతు కేతావత్‌ ముత్యాలు తనకున్న రెండెకరాల్లో బోరుబావి కింద వరిపంట సాగుచేశారు. మొదట్లో బోరుబావిలో నీరు పుష్కలంగా ఉండటంతో ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఇటీవల బోరుబావి నీరు తగ్గడంతో రెండెకరాల్లో మూడు మళ్లు తప్ప మిగతా పంట పూర్తిగా ఎండిపోయింది. మరో రెండు తడులు పెడితే పంట చేతికి వచ్చేది. పంటసాగు కోసం రూ. 60వేలు ఖర్చు చేసినట్లు రైతు ముత్యాలు వాపోయారు. చేసిన అప్పు ఎలా కట్టాలో పాలుపోవడం లేదని కంటతడి పెట్టుకుంటున్నారు.

డ్చర్ల మండలం పెద్ద ఆదిరాలకు చెందిన రైతు కొంగల రామలింగం నాలుగెకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగుచేశారు. రెండు బోర్ల సహాయంతో మొక్కజొన్నకు నీరు అందిస్తున్నారు. ఇప్పటి వరకు పంట పెట్టుబడిగా రూ.50 వేలు వెచ్చించారు. కంకి పట్టే దశలో ఒక్కసారిగా బోర్లలో నీటిమట్టం పడిపోయింది. దీనికి తోడు విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా చేతికందే మొక్కజొన్న పంట కళ్లెదుటే ఎండటంతో విధిలేక పశువులకు మేతగా వదిలిపెట్టారు. మూడు నెలల కష్టంతో పాటు సాగు వ్యయం భూమిలో కలిసిపోయింది. పెట్టుబడి పెట్టిన డబ్బు అప్పుగా మిగిలింది.

ట్టు మండల కేంద్రానికి చెందిన రైతు కుర్వ వీరన్నకు 15 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. 3 కి.మీ. దూరంలో ఉన్న నెట్టెంపాడు ప్రాజెక్టులోని ర్యాలంపాడు కాల్వ నుంచి తన పొలానికి 450 పైపులు వేసుకుని పంటసాగు చేస్తున్నారు. అయితే ఏప్రిల్‌ వరకు నీటిని అందిస్తామని అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలను నమ్మిన ఈ రైతు.. యాసంగిలో రూ. 3.36లక్షల పెట్టుబడి పెట్టి పదెకరాల్లో వేరుశనగ సాగుచేశారు. రెండున్నర నెలల తర్వాత నీటి తడులకు ఇబ్బందికరంగా మారడంతో 10 ఎకరాల్లో సాగుచేసిన వేరుశనగ పంటను వదిలేశారు. గతేడాది యాసంగి పంటలకు నీళ్లు రావని చెప్పడంతో సాగుచేయలేదని.. ఈసారి ఏప్రిల్‌ వరకు నీరందిస్తామని చెప్పడంతో పంటసాగు చేసి, తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చిదని రైతు కుర్వ వీరన్న వాపోయారు.

గట్టు శివారులో నీరు లేక ఎండిన పొగాకు పంటను మేస్తున్న గొర్రెలు

న్వాడ మండలం మునిమోక్షం గ్రామానికి చెందిన రైతు బోయిని అంజిలయ్య ఎకరన్నర పొలంలో వరిసాగు చేశారు. వరినాట్లు, కలుపు నివారణ, క్రిమిసంహారక మందులకు మొత్తం రూ. 40వేలకు పైగా ఖర్చు పెట్టారు. వేసవి ప్రారంభంలోనే బోరులో పూర్తిగా నీరు అడుగంటడంతో పొట్ట దశలో ఉన్న పంటకు నీరు లేక పశువులకు మేతగా వదిలేశారు. యాసంగిలో వరిసాగుతో రూ. 1.40లక్షలు నష్టపోవాల్సి వచ్చిందని రైతు అంజిలయ్య ఆవేదన చెందుతున్నారు.

ఖిల్లాఘనపురం మండలం గట్టుకాడిపల్లికి చెందిన రైతు రాసుమళ్ల నాగరాజు దేవుడి పొలం మూడెకరాలు కౌలుకు తీసుకుని వరిపంట సాగుచేశారు. ఇటీవల బోరుబావిలో నీరు తగ్గడంతో రెండెకరాల్లో పంట ఎండిపోవడంతో పశువులకు మేతగా వదిలేశారు. పంటసాగు కోసం రూ.లక్ష వరకు ఖర్చయ్యాయని.. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

కాల్వ నీరు అందుతుందనే ఆశతో రూ. 90వేల పెట్టుబడులు పెట్టి రెండెకరాల్లో వేరుశనగ, ఒక ఎకరంలో వరిపంట సాగుచేశా. అధికారులు, పాలకులు చెప్పినట్టుగా కేఎల్‌ఐ డీ–8 కాల్వ నుంచి మైనర్‌ కాల్వను తవ్వకపోవడం, ఉన్న బోరులో భూగర్భజలాలు అడుగంటి పోవడంతో నీరు అందక సాగుచేసిన పంటలు ఎండిపోయి పూర్తిగా నష్టపోవాల్సి వచ్చింది. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు.

– కండ్యానాయక్‌, అన్నారంతండా, పాన్‌గల్‌ మండలం

సంగంబండ రిజర్వాయర్‌ కుడి కాల్వపై ఆధారపడి నాలుగెకరాల్లో వరిసాగు చేశా. పంట చేతికివచ్చే సమయానికి కాల్వ నీరు అందకపోవడంతో పంట మొత్తం పశువులకు వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. పంటసాగు కోసం రూ. 1.20లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాను. పది రోజులుగా 800 మీటర్ల దూరం సాగునీరు తీసుకురావడానికి రూ. 30 వేలకు పైగా ఖర్చుచేసినా ఫలితం లేకుండాపోయింది. పంట పూర్తిగా ఎండిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి.

– సురేష్‌, యువ రైతు, తాళంకేరి, మాగనూర్‌ మండలం

నేను రెండున్నర ఎకరాల్లో వరిసాగు చేశా. ఇప్పటి వరకు రూ. 80వేల వరకు పెట్టుబడులు పెట్టాను. పంట పొట్టదశకు వచ్చే సమయంలో కాల్వ నీరు బంద్‌ కావడం, బోరు నీరు రాకపోవడంతో పంట మొత్తం ఎండింది. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.

– శంకరమ్మ, మహిళా రైతు,

తాళంకేరి, మాగనూర్‌ మండలం

యాసంగి సీజన్‌ ప్రారంభంలో బోరుబావిలో నీరు పుష్కలంగా ఉండటంతో నాలుగెకరాల్లో వరిపంట సాగుచేశా. వేసవి ప్రారంభంలోనే భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో బోరు నీరు రావడంలేదు. ఇప్పటికే రెండెకరాల్లో పంట పూర్తిగా ఎండిపోవడంతో పశువులకు వదిలేశా. పంటసాగు కోసం రూ. 80వేల వరకు ఖర్చుచేశాను. – కె.శ్రీనివాస్‌రెడ్డి, రైతు,

చొక్కన్నపల్లి, వెల్దండ మండలం

బోరుబావులపై ఆధారపడి మూడెకరాల్లో వరిసాగు చేశా. ప్రస్తుతం బోరుబావుల్లో భూగర్భ జలాలు తగ్గడం, కరెంటు సక్రమంగా రాకపోవడంతో రెండెకరాల్లో పంట ఎండింది. రూ. లక్షకు పైగా పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంట ఎండిపోతుంటే బాధగా ఉంది. కనీసం ఉన్న ఎకర పొలంలో అయినా పంట చేతికి వచ్చేలా లేదు.

గోపాల్‌పేట మండలం బుద్ధారం శివారులో నేను పదెకరాల్లో వరిపంట సాగుచేశా. నెలరోజులుగా లోఓల్టేజీ సమస్య వేధిస్తోంది. అధికారులకు చెప్పినా సమస్య పరిష్కారం కావడం లేదు. మోటార్లు కాలిపోతున్నాయి. 50 ఎకరాల పంట వరకు వారం రోజుల్లో ఎండిపోయే ప్రమాదం

ఉంది. లోఓల్టేజీ సమస్య తీర్చాలి.

–ఎర్ర లక్ష్మయ్య, రైతు,

బుద్ధారం, గోపాల్‌పేట మండలం

బోరుబావిలో ఉన్న నీటితో పంట పండించుకుందామని మూడెకరాల్లో మొక్కజొన్న సాగుచేశాను. పుప్పొడి దశలో ఉన్న పంటకు నీరందే పరిస్థితి లేక గొర్రెల మేతకు ఇచ్చాను.

– మద్దిలేటి, రైతు, రామాపురం, వడ్డేపల్లి మండలం

చివరి దశలో కాల్వ నీరు రాక..

కేఎల్‌ఐ కింద ఐదెకరాల్లో మొక్కజొన్న సాగుచేశా. పంటను సాగుచేసే సమయంలో కేఎల్‌ఐ కాల్వ ద్వారా నీరు బాగానే వస్తుండేవి. పంట చేతికందే సమయంలో నెలరోజుల నుంచి కాల్వలో నీరు రావడం లేదు. దీంతో పంట పూర్తిగా ఎండిపోయింది. పంటసాగుకు దాదాపు రూ. 70వేలు ఖర్చు చేశాను. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలి. – కుర్ముల శ్రీనివాస్‌రెడ్డి, రైతు, చొక్కన్నపల్లి, వెల్దండ మండలం

నీటి విడుదల సక్రమంగా ఉండాలి..

తుమ్మిళ్ల లిఫ్ట్‌ ద్వారా నీరు సక్రమంగా విడుదల చేస్తే పంటలు బాగా పండుతాయి. నీరు వస్తే పొలాలు మునిగేలా విడుదల చేస్తారు. లేకపోతే 20 రోజులైనా రావు. పంటలకు అవసరమైనప్పుడు నీటి తడులు ఇవ్వకపోవడంతో ఈ ఏడాది మొక్కజొన్న దిగుబడి తగ్గి నష్టపోయాం. – జమ్మన్న, ఆయకట్టు రైతు, పైపాడు, వడ్డేపల్లి మున్సిపాలిటీ

ప్రభుత్వమే ఆదుకోవాలి..

అప్పులే మిగిలాయి..

కాల్వ నీరు అందక ఎండింది..

పశువులకు వదిలేశా..

లోఓల్టేజీ సమస్య వేధిస్తోంది..

ఉన్న పంట కూడా చేతికొచ్చేలా లేదు..

గొర్రెల మేతకు ఇచ్చా..

– రైతు టీక్యానాయక్‌,

పెద్దగూడెంతండా, వనపర్తి మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
ఆశలు ఆవిరి 1
1/19

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి 2
2/19

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి 3
3/19

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి 4
4/19

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి 5
5/19

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి 6
6/19

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి 7
7/19

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి 8
8/19

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి 9
9/19

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి 10
10/19

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి 11
11/19

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి 12
12/19

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి 13
13/19

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి 14
14/19

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి 15
15/19

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి 16
16/19

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి 17
17/19

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి 18
18/19

ఆశలు ఆవిరి

ఆశలు ఆవిరి 19
19/19

ఆశలు ఆవిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement