మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో విద్యపైన జరిగిన చర్చలో పాల్గొని మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో ఈ రంగాన్ని నిర్వీర్యం చేశారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతుల కల్పన కింద 24 వేల పనులు చేయించామన్నారు. మహబూబ్‌నగర్‌లోని ఒకేషనల్ జూనియర్ కళాశాలలో 50 శాతం అడ్మిషన్లు పెరిగాయన్నారు. ఇప్పుడు అక్కడ 150 మంది బాలికలు అడ్మిషన్లు తీసుకున్నారన్నారు.