హన్వాడ: రైతుల జీవితాలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెలగాటమాడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. మంగళవారం నాగినోనిపల్లిలో ఇటీవల వడగండ్ల వానకు దెబ్బతిన్న వరిపంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో రైతుబంధు రూ.15 వేలకు పెంచుతామని చెప్పి.. ఇవ్వడం లేదని, విద్యుత్ సరఫరా గాలికొదిలారని, రైతు భరోసాను సక్రమంగా పంపిణీ చేయకుండా మోసం చేస్తున్నట్లు విమర్శించారు. ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు దగా పడుతున్నారని విమర్శించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, లేకుంటే రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కరుణాకర్‌గౌడ్, లక్ష్మయ్య, శ్రీను, జంబులయ్య, చెన్నయ్య, అనంతరెడ్డి, బాలకిష్టయ్య, చందర్, వెంకన్న, మాధవులు, రాజుయాదవ్, తిర్పతయ్య, రామకృష్ణయ్య పాల్గొన్నారు.