
పండుగలు సైతం లెక్కచేయక..
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో చిక్కుకున్న ఆరుగురి ఆచూకీ కోసం సహాయక బృందాలు పండుగలు సైతం లెక్కచేయక గాలింపు చేపడుతున్నాయి. సొరంగంలోని మట్టి, బురద, బండరాళ్లను కన్వేయర్ బెల్టు ద్వారా, టీబీఎం శకలాలను లోకో ట్రైన్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. సొరంగం పైకప్పు కూలిన సమీప ప్రదేశం నుంచి లోకో ట్రైన్ ఇంజన్, క్యాబిన్‌ను బయటకు తరలించడంతో రాకపోకలకు మార్గం సుగమమైంది. సహాయక చర్యల్లో అత్యాధునిక పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన సామగ్రిని వినియోగిస్తున్నారు.
కొనసాగుతున్న కన్వేయర్ బెల్టు పునరుద్ధరణ..
సహాయక చర్యలు మరింత వేగవంతం చేసేందుకు కన్వేయర్ బెల్టు పొడిగింపు పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం 13.630 కి.మీ. నుంచి 13.73 కి.మీ. వరకు వంద మీటర్లు పునరుద్ధరించారు. దీంతో ఎస్కవేటర్ల సాయంతో సొరంగం లోపలి మట్టిని బయటకు తరలించడానికి అవకాశం లభించింది.
ఎస్‌ఎల్‌బీసీలో నిర్విరామంగా
కొనసాగుతున్న సహాయక చర్యలు
మట్టి, బురద, రాళ్ల తొలగింపు
వేగవంతం
నీటిఊట ఎప్పటికప్పుడు తోడివేత