
చెరువులో మృతదేహం లభ్యం
గోపాల్‌పేట: ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి చెరువులో మృతదేహం లభ్యమైన సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నరేష్‌కుమార్ వివరాల ప్రకారం..
మండలంలోని పొలికెపాడు గ్రామానికి చెందిన జమ్మయ్య కుమారుడు మిద్దె చిన్నరాములు(45) మంగళవారం ఇంటి నుంచి పొలంవద్దకు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడు. రాత్రి వరకు తిరిగి రాకపోయేసరికి బుధవారం కుటుంబ సభ్యులు వెతికారు. పొలానికి ఆనుకుని ఉన్న పెద్దచెరువు వద్ద చెప్పులు, బీడీ కట్ట ఉండటంతో బుధవారం చెరువులో వెతికారు అయినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో చెరువులో మృతదేహం కనిపించగా బయటికి తీయించారు. మిద్దె చిన్నరాములుకు అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేది. చేపలకోసం చెరువులోకి దిగగా ఫిట్స్ వచ్చి మరణించాడని భార్య మంజుల ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. అతనికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.