
యువకుడి బలవన్మరణం
బల్మూర్: మండలంలోని కొండనాగుల గ్రామానికి చెందిన యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ముడావత్ శ్రీను కుమారుడు రాము(22) కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఉరేసుకున్నాడు. దీన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు అతన్ని అచ్చంపేట ఆస్పత్రికి తరలించే ఏర్పాటు చేస్తుండగా మృతి చెందాడు. రాము ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
చిరుతదాడిలో
మేకలు మృత్యువాత
కోస్గి రూరల్: చిరుతదాడిలో మేకలు మృత్యువాత పడిన సంఘటన బుధవారం గుండుమాల్ మండలంలో చోటుచేసుకుంది. గుండుమాల్ గ్రామానికి చెందిన పాతారి వెంకటయ్య ఎప్పటిలాగే తమ వ్యవసాయపొలం దగ్గర మూడు మేకలను కట్టేసి ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం వెళ్లి చూసే సరికి రెండు చనిపోగా, మరొకటి ప్రాణపాయ స్థితిలో ఉంది. చిరుతదాడి చేసిందని ఫారెస్టు అధికారి లక్ష్మణ్‌నాయక్‌కు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకోని పంచనామా చేశారు. మండలంలో వరుసగా చిరుతదాడి ఘటనలు జరుగుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్టు అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు రైతులు కోరుతున్నారు.
మరికల్‌లో
ఆవుదూడ..
మరికల్: మండలంలోని పల్లెగడ్డ గ్రామంలో చిరుత దాడి చేయడంతో ఆవు మృత్యువాత పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు శ్రీరామ్ తన ఆవును పొలం వద్ద కటేశాడు. అర్ధరాత్రి సమయంలో చిరుత దాడి చేసి చంపినట్లు రైతు పేర్కొన్నాడు. ఈ విషయంపై ఫారెస్ట్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.

యువకుడి బలవన్మరణం

యువకుడి బలవన్మరణం