
విద్యార్థిని కొట్టిన హాస్టల్ వార్డెన్
నవాబుపేట: ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని హాస్టల్ వార్డెన్ కట్టెతో కొట్టిన విషయంలో కేసు నమోదైన సంఘటన శుక్రవారం మండల పరిధిలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని చిన్నమేగ్యతండా పంచాయతీ గోప్యానాయక్ తండాకు చెందిన వినోద్ కొత్తపల్లిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈనెల 18న హాస్టల్ వార్డెన్ చేతిపై కట్టెతో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విద్యా సంవత్సరం ముగింపు ఉండటం, విద్యార్థి బయటికి రాలేకపోయాడు. చివరికి ఈనెల 22న ఇంటికి చేరుకుని తండ్రి భాస్కర్‌నాయక్‌కు హాస్టల్ వార్డెన్ బాలచందర్ కట్టెతో తీవ్రంగా గాయపరచిన విషయాన్ని వివరించాడు. భాస్కర్‌నాయక్ విద్యార్థిని ఆస్పత్రిలో చేర్పించి శుక్రవారం హాస్టల్ వార్డెన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భాస్కర్‌నాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని కొట్టిన వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.
పశువుల పాక దగ్ధం
చారకొండ: మండల కేంద్రంలో జెల్ల గురువయ్య గౌడ్‌కు చెందిన పశువుల పాక ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం పశువుల కొట్టంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న రైతులు పశువులను కాపాడారు. దాదాపగా రూ.లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్ల గ్రామస్తులు తెలిపారు.
పోలీసులకు ఫిర్యాదు

విద్యార్థిని కొట్టిన హాస్టల్ వార్డెన్