
180 ఎకరాల్లో పంటనష్టం
దేవరకద్ర: మండలంలోని బల్సుపల్లిలో గురువారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి దాదాపు 180 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లింది. దెబ్బతిన్న పంటను శుక్రవారం ఏఓ రాజేందర్ అగర్వాల్ పరిశీలించారు. వడగండ్ల వర్షానికి జరిగిన పంటనష్టంపై అధికారులకు నివేదిక అందిస్తామన్నారు.
తడిచిన ధాన్యం పరిశీలన
దేవరకద్ర రూరల్: అకాల వర్షంతో దేవరకద్ర మార్కెట్ యార్డులో తడిచిన ధాన్యాన్ని తహసీల్దార్ కృష్ణయ్య పరిశీలించారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఉన్నతాధికారుల అదేశాల మేరకు తహసీల్దార్ పరిశీలించి.. రైతుల వివరాలు నమోదు చేసుకున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలిపారు.