
ట్రాక్టర్ బోల్తా : రైతు దుర్మరణం
ఇటిక్యాల: ట్రాక్టర్ బోల్తాపడిన ప్రమాదంలో ఓ రైతు దుర్మరణం చెందిన ఘటన మండలంలోని షాబాద్ గ్రా మంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశ్ వివరాల మేరకు.. షాబాద్‌కు చెందిన రైతు తెలుగు చిన్న రామకోటి (65) ట్రాక్టర్‌తో గ్రామ సమీపంలోని తన వ్యవసాయ పొలాన్ని దున్ని వస్తుండగా.. శనగపల్లి రోడ్డు వ ద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో చిన్న రామకోటికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికు లు అతడిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి సోదరుడు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
బావిలో పడి
వ్యక్తి మృతి
అమరచింత: బావిలోని బోరుమోటారు బయటకు తీసే ప్రయత్నంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతిచెందిన ఘటన అమరచింతలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అమరచింతకు చెందిన హమాలీ గుడిసె శ్రీనివాసులు (34)తో పాటు హమాలీ రిక్షా రవి, మరో రవి ముగ్గురు కలిసి రిటైర్డ్ టీచర్ గోపాల్‌రెడ్డి పొలంలోని బావిలో ఉన్న బోరుమోటారు బయటకు తీసేందుకు వెళ్లారు. మోటారును బయటకు తీసు కుని వస్తున్న క్రమంలో బోరుపైపులు గుడిసె శ్రీనివాసులుపై పడటంతో అతడు బావిలో పడి మృతి చెందాడు. గ్రామస్తుల సహాయంతో బావిలో నుంచి అతడి మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడికి భార్య సువర్ణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మృతదేహం లభ్యం
కేటీదొడ్డి: ఉపాధి హామీ పథకం పను లు చేస్తుండగా.. గుర్తుతెలియని యు వకుడి (30) మృతదేహం లభ్యమైన ఘటన కేటీదొడ్డి మండలంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కేటీదొడ్డి గ్రామ శివారులో ఉన్న కొత్తకుంట ఆంజనే యస్వామి ఆలయం సమీపంలోని ప్రభుత్వ భూమిలో వర్షపునీటి నిల్వ కోసం ఉపాధి హామీ పథకం కూలీలు గుంతలు తవ్వుతుండగా.. యువకుడి మృతదేహం లభ్యమైంది. సమాచా రం అందుకున్న గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, ఎస్‌ఐ శ్రీనివాసులు ఘటన స్ధలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి గొంతు కోసినట్లు ఆనవాళ్లను గుర్తించారు. మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం జిల్లా మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
బీజేపీ నాయకుడి హత్యకు కుట్ర?
దేవరకద్ర/దేవరకద్ర రూరల్: దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన ఒక బీజేపీ ముఖ్యనేతపై ప్రత్యర్థులు హత్యకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఆయనకు తెలియడంతో తన వద్ద ఉన్న ఆధారాలతో ఎస్పీ జానకికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విచారణ చేసి, తనకు రక్షణ కల్పించాలని కోరినట్లు తెలిసింది.