
‘రిషి’ విద్యార్థుల ప్రభంజనం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని రిషి జూనియర్ కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. కళాశాల విద్యార్థులు 1000 లోపు ర్యాంకులతో అత్యుత్తమ ప్రతిభ చాటారు. రోహిత్‌రెడ్డి 308, జంగం శ్రీతులసి 927వ ర్యాంకులు సాధించినట్లు కళాశాల చైర్మన్ చంద్రకళా వెంకట్ తెలిపారు. వీరితో పాటు సాయి సుజన్‌రెడ్డి 98.40, ప్రణిత్‌కుమార్ 98.04, సాయి అక్షయ 97.08, తరుణ్‌సాయి 96.76 పర్సంటైల్ సాధించారన్నారు. 90శాతం పర్సంటైల్‌ను 36 మంది సాధించగా.. జేఈఈ అడ్వాన్స్‌కు 45 మంది అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. తమ కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక ర్యాంకులు సాధించిన కళాశాలగా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అకాడమీ చీఫ్ అడ్వైజర్ వెంకటయ్య, డీన్ లక్ష్మారెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ డీన్ భూపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రసన్నకుమారి, అధ్యాపకులు పాల్గొన్నారు.