చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి

Published Wed, Dec 20 2023 11:50 PM | Last Updated on Thu, Dec 21 2023 1:21 PM

- - Sakshi

భీమిని(బెల్లంపల్లి): చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన సల్మాన్‌ఖాన్‌ (22) చేపల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం భీమిని మండలంలోని కమలాపూర్‌ ప్రాజెక్టు వద్ద వాచ్‌మెన్‌గా ఉన్న బలరాంఆది సర్కార్‌కు నిత్యావసర సరుకులు ఇవ్వడానికి వెళ్లాడు.

ప్రాజెక్టులో చేపలు పడతానని నాటుపడవలో వెళ్లడంతో ప్రమాదవశాత్తు పడవ అడ్డం తిరిగింది. దీంతో ప్రాజెక్టులో పడి మృతి చెందాడు. ఎంతసేపటికీ ఒడ్డుకు చేరుకోకపోవడంతో బలరాం ఆది సర్కార్‌ మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. బుధవారం ఉదయం మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు గజ ఈతగాళ్లతో ప్రాజెక్టులో వెతికించగా మృతదేహం లభించింది. మృతుని సోదరుడు గౌస్‌ఖాన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement