‘ఓరియంట్’లో భద్రత వారోత్సవాలు
కాసిపేట: మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో మంగళవారం భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూనిట్ హెడ్ బాలగిరిధర్ భద్రత జెండా ఆవిష్కరించారు. అనంతరం డీఏవీ పాఠశాల విద్యార్థులకు, ఉద్యోగులకు, కార్మికులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ నెల 4 నుంచి 10 వరకు నిర్వహించనున్న కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికులతో భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో కంపెనీ సీనియర్ జీఎం ఆనంద్ కులకర్ణి, డీఏవీ ప్రిన్సిపాల్ కిరణ్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment