గంజాయి సేవిస్తున్న పలువురి అరెస్టు
చెన్నూర్: మండలంలోని కిష్టంపేట శివారులో గంజాయి సేవిస్తున్న పలువురిని అరెస్టు చేసినట్లు సీఐ రవీందర్ తెలిపారు. పోలీసు స్టేషన్‌లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిష్టంపేట జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న పదిమంది యువకులను పట్టుకుని విచారించగా గంజాయి సేవిస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు. వారి వద్ద 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో ఒకరు మైనర్‌కాగా మరొకరు పరారయ్యారన్నారు. సమావేశంలో ఎస్సై సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment