● నేడు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ● మారనున్న భూగర్భ గన
బెల్లంపల్లి: మందమర్రి ఏరియా శాంతిఖని లాంగ్‌వాల్ భూగర్భ గని ప్రాజెక్టు కోసం గురువారం ఉదయం 11గంటలకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఆకెనపల్లి గ్రామ పంచాయతీ పరిధి శాంతిఖని పాత మైన్ కార్యాలయం ఆవరణలో ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయం, మంచిర్యాల జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ప్రజాభిప్రాయం సేకరిస్తారు. ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి చేస్తున్న శాంతిఖని భూగర్భ గని పునఃధ్రువీకరణ కోసం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ(ఎంవోఈఎఫ్, సీసీ) 2018 ఏప్రిల్ 6న పర్యావరణ అనుమతుల కోసం జారీ చేసిన సూచనల నియామవళిలో ప్రతిపాదించిన మార్పులకు అనుగుణంగా మరోమారు ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమయ్యారు. 2006లో ఎంఓఈఎఫ్, సీసీ పర్యావరణ అనుమతి(ఈసీ)ని మంజూరు చేసింది. ఆ ప్రకారంగా 681.23 హెక్టార్ల ప్రాజెక్టు ప్రాంతంలో సాలీనా 1,167 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో గనిని నిర్వహించాలని ప్రతిపాదించారు.
కొత్తగా భూ సేకరణ అవసరం లేకుండానే..
1954లో అంకురార్పణ జరిగిన శాంతిఖని భూగర్భ గనిలో మూడేళ్ల ఎడబాటు తర్వాత 1957లో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత ప్రారంభమైంది. ఈ గని ప్రా రంభమై 71ఏళ్లు కావస్తోంది. ఇంకా ఈ గని భూగర్భంలో మరి కొన్నేళ్లపాటు తవ్వకాలు జరిపినా తరగని బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. తాజాగా పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో గని కార్యకలాపాల ని ర్వహణ కోసం అదనంగా భూమి సేకరించాల్సిన అవసరం లేదని సింగరేణి యాజమాన్యం స్పష్టం చే స్తుండగా.. గని భూగర్భంలో ప్రస్తుతం 500 మీటర్ల దిగువలో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఈ గనిని ఓ పెన్‌కాస్ట్ గనిగా మార్చే ప్రతిపాదనలు ఏమీ లేవని, భూగర్భ భౌగోళిక స్థితిగతుల రీత్యా ఓపెన్‌కాస్ట్ గనిగా మార్చే వీలు ఏ కోశాన లేదని యాజమాన్యం స్పష్టం చేస్తోంది. సమీప భవిష్యత్‌లో గనిలో 500 మీటర్ల నుంచి 700 మీటర్ల లోతు వరకు బొగ్గు వెలికితీతకు అవకాశాలు ఉన్నాయి. ఇందుకు గాను శాంతిఖని గనిని లాంగ్‌వాల్ ప్రాజెక్టుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
శాంతిఖని లాంగ్‌వాల్ ప్రాజెక్టు బోర్డు
ప్రభావిత గ్రామాల ప్రజల్లో భయాందోళనలు
ప్రతిపాదిత శాంతిఖని లాంగ్‌వాల్ ప్రాజెక్టు పరిసరాల్లో పలు గ్రామాలు ప్రభావితమయ్యే అ వకాశాలు ఉన్నాయి. తరాల నుంచి ఆయా గ్రామాల ప్రజలు సాగు భూములను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తు తం తలపెట్టిన పర్యావరణ ప్ర జాభిప్రాయ సేకరణతో సర్వ త్రా అనుమానాలు వ్యక్తమవుతునాయి. గని ప్రభావిత గ్రా మాలుగా ఆకెనపల్లి, లింగాపూ ర్, పాతబెల్లంపల్లి, గురిజాల, పెర్కపల్లి గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజల్లో నెలకొ న్న సందేహాలు, అనుమానాల ను నివృత్తి చేసి పునఃధ్రువీకరణ అంశంపై స్పష్టమైన అవగా హన కల్పించాల్సిన బాధ్యత రా ష్ట్ర కాలుష్య నియంత్రణ మండ లి, సింగరేణి యాజమాన్యంపై ఉంది. ఇప్పటికే గ్రామాల్లో శాంతిఖని గని ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు కాబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పర్యావరణ అనుమతి కోసం జరిగే ప్ర జాభిప్రాయ సేకరణకు ప్రభావి త గ్రామాల ప్రజలు, కార్మిక, రాజకీయపక్షాల శ్రేణులు, సా మాజిక కార్యకర్తలు హాజరై అభిప్రాయాలను వెల్లడించడానికి సిద్ధమయ్యారు.
ప్రాజెక్టు స్వరూపం
భూగర్భ గనిగా శాంతిఖని లాంగ్‌వాల్ ప్రా జెక్టు చేపడుతారు. ప్రాజెక్టు విస్తీర్ణం 681.23 హెక్టార్లు కాగా.. ఇందులో అటవీ భూమి 484.94హెక్టార్లు, అటవీయేతర భూమి 196.29 హెక్టార్లు ఉంది. గని జీవిత కాలం ఎనిమిదేళ్లు కాగా.. బోర్డు, ఫిల్లింగ్ మైనింగ్ పద్ధతిలో మైనింగ్ చేస్తారు. లాంగ్‌వాల్, రోడ్‌హెడర్, కంటిన్యూయస్ మైనర్ సాంకేతికతను వినియోగిస్తారు. మూలధన నిధులు రూ.307.840 కోట్లు కాగా.. పర్యావరణ పరిరక్షణకు రూ.50లక్షలు(మూల ధన నిధులు), రెవెన్యూ నిధులు సాలీనా రూ.39లక్షలు ఖర్చు చేస్తారు. గనిలో ఎనిమిది పొరలు గా బొగ్గు ఉన్నట్లు గుర్తించారు. ఎస్‌జే టాప్ సెక్షన్, ఎస్‌జే బాటమ్ సెక్షన్ పొరలుగా బొగ్గు వెలికి తీస్తారు.
నిల్వలు..
జియోలాజికల్ నిల్వలు 48.872 మిలియన్ టన్నులు ఉండగా.. వెలికితీయదగిన నిల్వలు 30.93 మిలియన్ టన్నులు, భూగర్భ గని ద్వారా తీయగలిగే నిల్వలు 17.775 మిలి యన్ టన్నులు ఉన్నాయి. 2023 మార్చి 31వరకు 9.01మిలియన్ టన్నులు బొగ్గు వెలికి తీయగా.. 2023 ఏప్రిల్ 1నాటికి 8.765 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయని, బొగ్గు సగటు గ్రేడ్ జీ–9గా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment