● ఒక్క నిమిషం సడలింపుతో ఊరట ● పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఐఈవో
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. నిమిషం నిబంధనను సడలిస్తూ ఐదు నిమిషాలకు పెంచడం విద్యార్థులకు ఊరట కలిగించింది. పరీక్ష నిర్ధేశిత సమయం కంటే మూడు, నాలుగు నిమి షాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులనూ అనుమతించారు. కుటుంబసభ్యులతో కలిసి పరీక్ష సమయానికి ముందే వచ్చిన కొందరు నోటీసు బోర్డులో గది నంబరు తాఫీగా చూసుకున్నారు. ఈ నెల 22 వరకు జరిగే పరీక్షల కోసం 23 పరీక్ష కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. మొదటి సంవత్సరం 6365 మంది విద్యార్థులకు గాను 6078 మంది హాజరు కాగా 287 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 5697 మందికి 5497 మంది పరీక్ష రాయగా.. 225 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 668 మందికి 606 మంది హాజరు కాగా 62 మంది రాలే దు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కేంద్రాల్లోకి అనుమతించారు. చేతిగడియారాలు, పరీక్ష ప్యాడ్‌లపై చిన్నగా రాసినట్లు ఉన్నా అనుమతించలేదు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఐఈవో అంజయ్య పరిశీలించారు.
పకడ్బందీగా నిర్వహించాలి
జైపూర్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలను అవకతవకలకు తావులేకుండా లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఆయన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్, తాగునీరు, ఫ్యాన్లు, వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment