శ్రీరాంపూర్: యంత్రాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్‌ఎం) డీ.సత్యనారాయణరావు తెలిపారు. బుధవారం ఆయన శ్రీరాంపూర్ ఓసీపీని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఓసీపీల్లో ఉత్పత్తి పెరుగాలంటే యంత్రాల పనిగంటలు పెంచుకోవాలని తెలిపారు. అనంతరం కోల్ ఎన్‌క్లోజర్ ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జీఎం(సీహెచ్‌పీఎస్) తిరుమల్‌రావు, ఏరియా ఎస్‌ఓటు జీఎం యన్.సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఓసీపీ పీఓ టీ.శ్రీనివాస్, డీజీఎంలు కేశవరావు, రవీందర్, క్వాలిటీ మేనేజర్ కే.వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రాజెక్టు ఇంజనీర్ నాగరాజు, గని మేనేజర్ బ్రహ్మాజీ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment