కాంగ్రెస్ నాయకుడిపై ఫిర్యాదు
ఆదిలాబాద్‌టౌన్: ప్రభుత్వ ఉద్యోగులపై తప్పుడు ఫిర్యాదులతో వేధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకుడు సామ రూపేష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కోరారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంద అశోక్, ఏ.నవీన్‌కుమార్‌తోపాటు వివిధ శాఖలకు చెందిన 50 మంది ప్రభుత్వ ఉద్యోగులు గురువారం వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్‌ను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఉద్యోగ జేఏసీ చైర్మన్ అశోక్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు తనపై తప్పుడు ఫిర్యాదు చేసి, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి తన పరువుకు భంగం కలిగించారన్నారు. జిల్లాకేంద్రంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రకటించిన వార్తను తాను వాట్సప్‌లో పోస్ట్ చేశానని, ఇది ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈనెల 5న జరిగిన విషయమన్నారు. గజెటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శివ కుమార్, సంఘ బాధ్యులు నరేశ్, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు సప్దార్ అలీ, ఆశన్న, నర్సింలు, గోపి, ప్రవీణ్, అనిల్, అరుణ్, చంద్రశేఖర్, సంతోష్, రాజేశ్వర్, వెంకటేశ్, కలీం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment