చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
● కాపాడిన గంగారాం యువకులు
నెన్నెల: చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని యువకులు గురువారం కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన కొమ్ము మొండయ్య గంగారాంలోని దామెర చెరువులోకి వెళ్లి ఆత్మహత్యకు యత్నించగా అటుగా వెళ్లిన యువకులు సిగ్గం అంజి, సిగ్గం సంతోష్, రామటెంకి రాజేందర్, జాడి రాజ్‌కుమార్‌లు అతడిని బయటకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై ప్రసాద్ హోంగార్డు రామరాజును పంపించారు. సదరు వ్యక్తిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించారు. అతడి కుటుంబ సభ్యులను పిలిపించి అప్పగించారు. ప్రాణాలు కాపాడిన గంగారాం యువకులను ఎస్సై అభినందించారు. కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment