ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి
ఇంద్రవెల్లి: మండలంలోని ఓల్‌మద్రి సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి చెందాడు. ఎస్సై సునీల్, కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలోని భీంనగర్ కాలనీకి చెందిన జెల్పెట్ వినోద్(35), తమ్ముడు పూలాజీతో కలిసి గురువారం అటవీశాఖ కార్యాలయంలో నర్సరీ నుంచి తన ట్రాక్టర్ ద్వారా ప్లాంటేషన్ మొక్కలు తరలిస్తున్నాడు. మార్గమధ్యలో ఓల్‌మంద్రి సమీపంలో కల్వర్టు వద్ద ప్రమాదవశాత్తు బోల్తాపడింది. వినోద్‌పై ట్రాక్టర్ పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డైవింగ్ చేస్తున్న పూలాజీ సురక్షితంగా బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని జేసీబీతో మృతదేహాన్ని బయటకు తీశారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మీబాయి, కుమారుడు రుద్రక్షిత్, కూతుళ్లు ప్రకృతి, ఏడాది వయస్సు ఉన్న పాప ఉంది.
ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి
Comments
Please login to add a commentAdd a comment