వాతావరణం ఆకాశం మబ్బుపట్టి ఉంటుంది. ఎండల తీవ్రత పెరుగుతు
ఎమ్మెల్యే పీఏపై ఫిర్యాదులు!
● పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జికి పంపిస్తున్న నియోజకవర్గ వాసులు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో ఓ ఎమ్మెల్యే పీఏ తీరు వివాదాస్పదమవుతోంది. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచే డబ్బులు వసూలు చేస్తుండడంతో అంతా అవాక్కవుతున్నారు. భూ ములు, అభివృద్ధి పనులు, ఇతర ఏదైనా అవసరం కోసం వెళ్తే పని కావాలంటే ఎంతో కొంత ముట్టజెప్పాలనే ధోరణితో ఉండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తొలిసారిగా ఆ నియోజకవర్గంలో పార్టీ విజయం సాధించింది. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారు ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సదరు ప్రజాప్రతినిధి వద్ద పైరవీలు చేయించడంతోపాటు పనులు చేయడం, పార్టీ పదవులు, ప్రాధాన్యత విషయంలో అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. గతంలో వరి ధాన్యం కొ నుగోలు కేంద్రాల మంజూరు కోసం పైసలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నియోజకవర్గ కేంద్రంతోపాటు సింగరేణి, అసైన్డ్, లావాణి పట్టా భూముల ఆక్రమణలు, కబ్జాలు, అవుట్‌సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగాలు, బదిలీలు వంటి తమ అనుకూల పలుకుబడితో పోలీసు, రెవెన్యూ అధికారులతో చెప్పిస్తూ చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. డీఎంఎఫ్‌టీ పనుల్లో ఒక శాత కమీషన్ వసూలు చేయడం, ఇక్కడ జరుగుతున్న అవినీతిపై గతంలో మావోయిస్టులు సదరు ఎమ్మెల్యేను హెచ్చరిస్తూ లేఖ సైతం విడుదల చేశారు.
అధిష్టానానికి ఫిర్యాదు
సదరు ఎమ్మెల్యే పీఏపై నూతనంగా వచ్చిన పార్టీ రాష్ట్ర ఇన్చార్జికి మెయిల్స్, వాట్సాప్‌ల్లో ఫిర్యాదులు వెళ్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ఇన్‌చార్జి అయినా చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ఆయన తీరుతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అర్హులైన వారికి ఇబ్బందులు వస్తున్నాయని, వెంటనే దృష్టి సారించాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిసింది.
పత్తి రైతులు ఆందోళన
చెందవద్దు
● ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
చెన్నూర్: చెన్నూర్ ప్రాంత పత్తి రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నా రు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధార్ లింక్ అప్‌డేట్ సమస్యతో పది రోజులు పత్తి కొనుగోళ్ల విషయంలో రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. ఎంపీ వంశీకృష్ణ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి సమ స్య పరిష్కారానికి కృషి చేశారన్నారు. ఈ ఏడాది 3.50 లక్షల క్వింటాళ్ల పత్తి కోనుగోలు చేశారని, మ రో 70 వేల క్వింటాళ్ల పత్తి ఉన్నట్లు తెలిపారు. సోమవారం నుంచి వారం రోజులపాటు నిరంతరం పత్తి కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ చల్లా రాంరెడ్డి, నాయకులు సూర్యనారాయణ, హిమవంతరె డ్డి, రాజమల్లగౌడ్, చింతల శ్రీనివాస్, చెన్నూరి రాజే శ్, వెంకటేశ్, నాగరాజు, మహేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment