ఉత్తమ ఫలితాలు సాధించాలి
● కలెక్టర్ కుమార్ దీపక్
లక్సెట్టిపేట: పదోతరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ కుమా ర్ దీపక్ సూచించారు. గురువారం మండలంలోని జిల్లా పరిషత్ బాలికల, కస్తూరిబా పాఠశాలలను తనిఖీ చేశారు. వంటగదులు, భోజనశాల, పరిసరాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని 30 పడకల ఆస్పత్రిని పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ దిలీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఉన్నారు.
కేవీ భవన నిర్మాణ పనులు పరిశీలన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట పునరావాస కాలనీ శివారులో నిర్మిస్తున్న కేంద్రియ విద్యాలయం(కేవీ) పనులను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. రూ.26 కోట్లపై చిలుకు నిధులతో భవన నిర్మాణం చేపడుతున్నామని, వచ్చే విద్యా సంవత్సరానికి సిద్ధంగా ఉంటుందన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్‌పాండే, ఆర్‌ఐ ప్రభు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment