‘ఇంటర్’ పరీక్షలకు 97శాతం హాజరు
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. 6,071 మంది విద్యార్థులకు గానూ 5,914 మంది పరీక్షలకు హాజరుకాగా 157 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 5,433 మందికిగానూ 5,299 మంది హాజరుకాగా 134 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విద్యార్థులు 638 మందికిగానూ 615 మంది హాజరుకాగా 23 మంది గైర్హాజరయ్యారు. 97శాతం హాజరు నమోదైంది. ప్రతీ విద్యార్థిని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే కేంద్రాల్లోకి అనుమతించారు. పలు పరీక్ష కేంద్రాలను డీఐఈవో అంజయ్య పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment