అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు టీచర్
అతివలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. పురుషులకు సమానంగా సత్తా చాటుతున్నారు. క్రీడా, విద్య, స్వయం ఉపాధి, తదితర రంగాల్లో ప్రతిభ కనబర్చి శెభాశ్ అనిపించుకుంటున్నారు ఉమ్మడి జిల్లాలోని పలువురు నారీమణులు. కొందరు
పలువురికి ఉపాధి చూపుతున్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం.
చెన్నూర్‌రూరల్: గతంలో సర్పంచ్‌గా పని చేసింది. ఆ పదవీ కాలం పూర్తి కాగానే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంది. మండలంలోని అంగ్రాజ్‌పల్లికి చెందిన చెవ్వ సువర్ణ. తాండూరు మండలం తంగళ్లపల్లికి చెందిన ఈమెకు చెన్నూర్ మండలం అంగ్రాజ్‌పల్లికి చెందిన చెవ్వ శ్రీనివాస్‌తో 2003లో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. అప్పటికే బీఎస్సీ ఫస్టియర్ చదివింది. మూడేళ్లలో పూర్తి చేయాల్సిన డిగ్రీ.. పిల్లల ఆలపాలన చూసుకుంటూ ఐదేళ్లు పట్టింది. 2010లో ఎంఎస్సీ, 2012లో బీఈడీ పూర్తి చేసింది. 2013లో సర్పంచ్‌కు బీసీ మహిళా రిజర్వేషన్ రావడంతో గ్రామస్తుల కోరిక మేరకు స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందింది. ఐదేళ్లవరకు ప్రజలకు సేవలందించింది. 2019లో చెన్నూర్‌లోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో గణిత టీచర్‌గా ఎంపికై విద్యార్థులకు పాఠాలు చెబుతోంది. భర్త ప్రోత్సాహంతో సాధ్యమైందని అంటోంది.
స్విట్జర్లాండ్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్
కోటపల్లి: మా స్వగ్రామం కో టపల్లి. మే ము నలుగురు అక్కాచెల్లెళ్లు. తల్లిదండ్రులు బాగా చదివించారు. అందరూ వివిధ రంగాల్లో స్థిరపడ్డాం. తాను స్విట్టర్లాండ్‌లో ఆరేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఉద్యో గం చేస్తున్నా. ఏటా రెండు నెలలు అమ్మానాన్నలను స్విట్టర్లాండ్‌కు తీసుకెళ్తున్నా. – లక్ష్మీప్రసన్న
భర్త ప్రోత్సాహంతో
భీమారం: ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడాలనే లక్ష్యం పాఠశాల స్థాయిలో ఏర్పడింది. అందుకు బాగా చదివాను. పెళ్లయ్యాక చదువుకోవాలని భర్త ప్రోత్సాహించారు. టీచర్‌గా సేవ చేయాలనే కోరిక ఉన్నా భర్త తనను ఎస్సైగా చూడాలని ఉండేది. హైదరాబాద్‌కు వెళ్లి కోచింగ్ తీసుకున్నా. 2019 ఎస్సైగా ఎంపికయ్యాను. – కె శ్వేత,భీమారం ఎస్సై
ఒక్క బిడ్డ చాలనుకున్నం
నిర్మల్: ‘ఆడబిడ్డయితే ఏంటి.. తను వారసురాలే కదా. తనకు ఉత్తమ చదువును, ఉన్నత జీవితాన్ని ఇవ్వాలనుకున్నాం. అందుకే మాకు ఒక్కబిడ్డనే చాలనుకున్నాం..’అంటున్నారు నిర్మల్ జిల్లాకేంద్రంలోని ఆదర్శనగర్‌కు చెందిన తిరుపతి సుస్మిత, ప్రమోద్‌రావు దంపతులు. ఎవరెన్ని ఒత్తిళ్లు పెట్టినావారు అనుకున్నట్లుగానే ఒక్కబిడ్డకే జన్మనిచ్చారు. తన ఆకాంక్షలకు తగ్గట్లుగానే చదివించారు. తల్లిదండ్రుల ఆశయాలను ఆకళింపు చేసుకున్న ఆ బిడ్డ శరదితన్వి తనకంటూ గుర్తింపును తెచ్చుకుంటోంది. స్థానిక దీక్ష జూనియర్ కళాశాల కరస్పాండెంట్‌గా చేస్తున్న ప్రమోద్‌రావు ముందు నుంచి కొంత సామాజిక స్పృహతో ఆలోచిస్తుంటారు. శరదితన్వి ప్రస్తుతం ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఆక్సెంచర్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా చేస్తోంది. తండ్రిలాగే సామాజికస్పృహతో తన స్థాయిలో సేవలందిస్తోంది.
తమ బిడ్డ శరదితన్వితో సుస్మిత, ప్రమోద్‌రావు దంపతులు
స్వ‘శక్తి’తో ముందుకు..
ఆదిలాబాద్: ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న మహిళ ప్రైవేట్ ఉద్యోగానికి మొగ్గు చూపింది జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి కాలనీకి చెందిన ముదిగొండ కల్పన. ఇంటర్ తర్వాత వివాహం కాగా, అటు కుటుంబ బాధ్యతలు మోస్తూనే 2007లో డిగ్రీ పూర్తి చేసింది. భర్త ప్రోత్సాహంతో 2010లో జిరాక్స్, ఆన్‌లైన్ సెంటర్, బుక్‌స్టాల్ ప్రారంభించింది. టైలరింగ్ చేస్తోంది. ఇటీవల బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ తీసుకుంటుంది. ఓ వైపు ఇంటిని చక్కదిద్దుతూనే బుక్‌సెంటర్ నడుపుతోంది. కుమారుడు, కుమార్తెలను చదివించి ప్రయోజకులుగా చేయాలనే తనవంతుగా శ్రమిస్తోంది.
ఆడబిడ్డపై ఆలోచన మారాలి
నిర్మల్:‘ఆడబిడ్డయినా.. మగబిడ్డయినా ఒకటే. ఒ కప్పుడు మగపిల్లాడుంటే చాలు అనుకునేది. కా నీ.. ఈరోజుల్లో ఎవరైనా మంచి చదువు, ఉ ద్యో గం ఉంటేనే విలువ. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీ ల నుంచి మొదలు పెళ్లి సంబంధాల దాకా ఆడ, మగ అనే తేడాలు చూడటం లేదు. వారి చదువు, హోదా, సంస్కారాన్ని గుర్తిస్తున్నారు. అందుకే మాకు ఒక్క ఆడబిడ్డనే అని ఏరోజూ ఆలోచించలేదు..’అని చెబుతున్నారు నిర్మల్‌కు చెందిన వైద్యదంపతులు చిటికేశి రంజిత, సంతోష్‌రాజ్. తమ బిడ్డ ఇషితారాజ్ ఎంత చదివితే అంత చదివిస్తామంటున్నారు. ప్రస్తుతం తాను ఎంబీబీఎస్ చదువుతోంది. అమ్మ గైనకాలజిస్ట్, నాన్న పీడియాట్రిక్ వైద్యుడు.వీరిద్దరూ బిడ్డకు గైడ్ చేస్తున్నామే తప్పా .. ఇది చదువు, అది చేయు అని చెప్పడం లేదంటున్నారు. అన్నిరంగాల్లో సీ్త్ర, పురుషులు సమానంగా పనిచేస్తున్నారని, ఇకపై ఆడ,మగ అనే ఆలోచనను మానుకోవాల్సిందేనని అంటున్నారు.
వైద్య వృత్తిని వదిలి.. ప్రజాసేవకు కదిలి
బోథ్: ఎంబీబీఎస్ పూర్తి చేసి.. వైద్య వృత్తిని వదిలి ప్రజాసేవకు కదిలారు బోథ్‌కు చెందిన డాక్టర్ సంధ్యారాణి. జెడ్పీటీసీగా గెలుపొంది మహిళా శక్తిని నిరూపించారు. బోథ్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించా రు. జెడ్పీ సమావేశాల్లో తనగొంతు విని పించారు. ఆమె వైద్యురాలు కావడంతో బోథ్ ఆసుపత్రిని అభివృద్ధి పర్చే ప్రయత్నం చేశారు. ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి రూ.10 కోట్ల నిధులు తేవడంలో కృషిచేశారు. మాజీ జెడ్పీటీసీగా ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
– డా.సంధ్యారాణి, మాజీ జెడ్పీటీసీ, బోథ్
ఇతరులపై ఆధారపడకుండా..
ఆసిఫాబాద్‌అర్బన్: ఇతరులపై ఆధారపడకుండా సొంతకాళ్లపై నిలబడాలని నిర్ణయించుకున్నా. ఇంటి వద్దే 20 ఏళ్ల క్రితమే టిఫిన్స్ సెంటర్ ప్రారంభించా. ప్రస్తుతం ఇంటి వద్ద 15 మంది ఉపాధి కల్పిస్తూ.. వ్యాపారం విజయవంతంగా కొనసాగుతోంది. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరా క్యాంటీన్‌ను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రారంభించాం. అక్కడ కూడా మరో ఐదుగురు ఉపాధి పొందుతున్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదు. ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలి. – మార స్వరూప,
మహిళా సమాఖ్య సంఘం సభ్యురాలు, ఆసిఫాబాద్
చిన్నచూపు పోవాలి
ఆసిఫాబాద్‌అర్బన్: మా స్వగ్రామం మంచిర్యాల. నాన్న ఓ సంస్థలో చిరుద్యోగి. ఇద్దరం ఆడపిల్లలం అయినా ఎవరిపైనా ఆధారపడొద్దని ఉన్నత చదువులు చదివించారు. నేను ప్రస్తుతం ఆసిఫాబాద్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్(ఏటీవో)గా పనిచేస్తుండగా, మా చెల్లెలు ప్రభుత్వ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తోంది. నాకు ముగ్గురు, మా చెల్లికి ఇద్దరు ఆడపిల్లలే. వారిని అన్నిరంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతాం. చదువుతోనే భవిష్యత్తు బాగుంటుంది. ప్రతీ మహిళా చట్టాలపై అవగాహన ఉండాలి. సమాజంలో మహిళలనే చిన్నచూపు పోవాలి.– భానుమతి గోమాస, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్
●
తేడా ఉండొద్దు
ఆసిఫాబాద్‌రూరల్: మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా సమాజంలో అందరం ఒక్కటే అనే భావన రావాలి. కొంతమంది తల్లిదండ్రులు కుమార్తె కంటే కుమారుడినే ఎక్కువ ఇష్టపడుతారు. అలా సంతానాన్ని సమానంగా చూడాలి. వారి నిర్ణయాలకు విలువ ఇవ్వాలి.
– శ్రీదేవి, బీజెడ్‌సీ సెకండియర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆసిఫాబాద్
మహిళలకు అవకాశాలు పెరిగాయి
భైంసాటౌన్: నేటి కాలంలో మహిళలకు అవకాశాలు పెరిగాయి. ఏ రంగంలోనైనా వివక్ష ఉంటుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు లభిస్తుంది. పెరుగుతున్న ఖర్చులకు ఇంట్లో భార్యాభర్తలిద్దరూ పనిచేస్తేనే ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. రాజకీయాల్లో మహిళలు ధైర్యంగా ముందుకు రావాలి. – సిరం సుష్మారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షురాలు, భైంసా
కఠిన చట్టాలు రావాలి
ఆసిఫాబాద్‌రూరల్: మహిళలకు కొన్నిచోట్ల రక్షణ లేకుండా పోయింది. యువతులు, మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోయాయి. తప్పుచేసిన వారికి కఠిన శిక్షలు లేకపోవడంతో రెచ్చిపోతున్నారు. సమాజంలో మహిళల రక్షణకు కఠిన చట్టాలు రావాలి.
– అశ్విని, ఎంపీసీఎస్ ఫైనలియర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆసిఫాబాద్
అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు టీచర్
అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు టీచర్
అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు టీచర్
అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు టీచర్
అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు టీచర్
అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు టీచర్
అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు టీచర్
అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు టీచర్
అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు టీచర్
అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు టీచర్
అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు టీచర్
అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు టీచర్
అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు టీచర్
Comments
Please login to add a commentAdd a comment