● ఇళ్లలో స్వేచ్ఛ లభిస్తోంది.. ● బయట అనుమానపు చూపులు ● త
మంచిర్యాలఅర్బన్/మంచిర్యాలటౌన్/చెన్నూర్/నిర్మల్/వాంకిడి/ఆసిఫాబాద్‌రూరల్/బోథ్: మహిళలు, యువతులు, విద్యార్థినులు అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. పురుషులకు దీటుగా పనులు చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. కానీ స మాజంలో అక్కడక్కడ మహిళలపై చిన్నచూపు ఉండడం వల్ల అనేక అవకాశాలకు దూరమవుతున్నారు. పని ప్రదేశాల్లో వేధింపులు, ఆధిపత్య ధోరణులు మహిళలకు ప్రతిబంధకంగా మారుతున్నా యి. ఎక్కడ.. ఎవరితో వివక్షకు గురవుతున్నారనే అంశాలపై ‘సాక్షి’ మంచిర్యాలలోని శ్రీహర్ష డిగ్రీ కళాశాలతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యార్థినులు, యువతులు, మ హిళలు 350మంది నుంచి సర్వే ద్వారా వివరాలు సేకరించింది. తెలియని వారు, ఆకతాయిలతో ఇక్కట్లు పడుతున్నట్లు తేల్చిచెప్పారు. బస్టాప్‌ల్లో అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వె ల్లడైంది. ఇళ్లలో ఆడ, మగ అనే వివక్ష లేదని, అభిప్రాయాలకు గౌరవం లభిస్తోందని స్పష్టమైంది.
● ఇళ్లలో స్వేచ్ఛ లభిస్తోంది.. ● బయట అనుమానపు చూపులు ● త
● ఇళ్లలో స్వేచ్ఛ లభిస్తోంది.. ● బయట అనుమానపు చూపులు ● త
Comments
Please login to add a commentAdd a comment