● ఆదిలాబాద్‌, మంచిర్యాలలో కొత్తగా డిస్పెన్సరీలు ● అందుబాటులోకి వైద్యం ● కార్మిక కుటుంబాలకు ఉచితంగా సేవలు | - | Sakshi
Sakshi News home page

● ఆదిలాబాద్‌, మంచిర్యాలలో కొత్తగా డిస్పెన్సరీలు ● అందుబాటులోకి వైద్యం ● కార్మిక కుటుంబాలకు ఉచితంగా సేవలు

Published Sun, Mar 9 2025 1:39 AM | Last Updated on Sun, Mar 9 2025 1:38 AM

● ఆది

● ఆదిలాబాద్‌, మంచిర్యాలలో కొత్తగా డిస్పెన్సరీలు ● అందుబ

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలకు వైద్యం చేరువ చేసేందుకు ఈఎస్‌ఐ(కార్మిక రాజ్య బీమా సంస్థ) కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మరో రెండు డిస్పెన్సరీల ఏర్పాటుకు నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 18డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తుండగా ఇందులో ఆదిలాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో రెండు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్మల్‌ పట్టణం శాంతినగర్‌లో, మంచిర్యాల పట్టణం ఏసీసీ కాలనీలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు ఉన్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌లో ఈఎస్‌ఐ ఆసుపత్రి ఉంది. నిర్మల్‌లో బీడీ కార్మికులకు ప్రత్యేకంగా మరొకటి ఉంది. ఉమ్మడి జిల్లాలో సిమెంట్‌ పరిశ్రమలు, మట్టి, స్పిన్నింగ్‌, పేపర్‌ మిల్లు తదితర కార్మిక వర్గాలు ఎక్కువగా ఉన్న చోట్ల ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో కార్మికులకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటయ్యాయి. ఈ డిస్పెన్సరీ, ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ఖాళీలతో అరకొర వైద్యమే అందుతోంది. అంతేగాక సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే అసౌకర్యాల మధ్య సేవలందిస్తున్నాయి. ఇటీవల మంచిర్యాల కలెక్టరేట్‌ సమీపంలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీ నిర్మాణం కోసం భూమి కేటాయించారు. కొత్తగా ఆదిలాబాద్‌ పట్టణం, మంచిర్యాల జిల్లా జైపూర్‌ సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటు ఆవరణలో కొత్త డిస్పెన్సరీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతో సేవలు మెరుగవుతాయనే ఆశలు నెలకొన్నాయి.

కార్డు ఉంటే..

ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు చాలీచా లని జీతాలతో తమ కుటుంబాల వైద్య ఖర్చులకే రూ.లక్షల్లో వెచ్చించాల్సి వస్తోంది. నెలకు రూ. 21వేల లోపు వేతనం పొందుతున్న ప్రతీ కార్మికుడు లేదా ఉద్యోగి ఈఎస్‌ఐకి అర్హులు. దివ్యాంగ ఉద్యోగులైతే రూ.25వేల వరకు అవకాశం ఉంది. ఈఎస్‌ఐ కార్డుతో ఉచితంగా వైద్య సేవలు పొందే అవకాశం ఉంది. స్థానికంగా వైద్య పరీక్షలు చేయించుకుని సిఫారసుతో హైదరాబాద్‌తోపాటు దేశంలో ఎక్కడైనా ఈఎస్‌ఐ పెద్ద ఆసుపత్రిల్లో ఖరీదైన వై ద్యం సైతం ఉచితంగా పొందవచ్చు. అలాగే ఈఎస్‌ ఐ చెల్లిస్తున్న కార్మికులకు పని ప్రదేశాల్లో గాయపడిన, ఇతర ప్రమాదం ఏదైనా జరిగితే వేతనంతో కూడిన సెలవు, వైద్య ఖర్చులు పొందే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది ఈఎస్‌ఐని ఉపయోగించుకోవడం లేదు. ఇక కొన్ని సంస్థలు తమ పరిధిలో పని చేస్తున్న కార్మికులకు కనీసం ఈఎస్‌ఐ కూడా చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రై వేటు ఉద్యోగులు తప్పనిసరిగా ప్రతీ నెలా ఈఎస్‌ఐ చెల్లించేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

అవగాహన లేక సేవలకు దూరం

ఉమ్మడి జిల్లాలో వేలాది మంది ఆయా రంగా ల్లో పని చేస్తున్నారు. ప్రైవేటు విద్య, వైద్యారోగ్య సంస్థలు, మున్సిపల్‌, కార్పొరేషన్‌ సిబ్బంది, రవాణా, షాపింగ్‌ మాల్స్‌, ఫ్యాక్టరీలు, బ్యాంకింగ్‌, నాన్‌ బ్యాంకింగ్‌, హోటల్స్‌, రెస్ట్రారెంట్స్‌, సినిమా థియేటర్లు, తదితర చోట్ల కనీసం పది మంది పని చేసే చోట ఆయా యాజమాన్యాలు ఈఎస్‌ఐ పరిధిలోకి రావాల్సి ఉంది. అయితే చాలా చోట్ల ఇవేమి అమలు కావడం లేదు. దీంతో అనేక మంది కార్మికులు తమ కష్టార్జీతం వైద్యారోగ్య సేవలకే వెచ్చించాల్సి వస్తోంది. అయితే చాలామంది ఈ సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకే వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో కార్మికులకు విస్తృతంగా ప్రచారం కల్పించి అర్హులు సేవలు పొందేలా చూడాల్సిన అవసరం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
● ఆదిలాబాద్‌, మంచిర్యాలలో కొత్తగా డిస్పెన్సరీలు ● అందుబ1
1/1

● ఆదిలాబాద్‌, మంచిర్యాలలో కొత్తగా డిస్పెన్సరీలు ● అందుబ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement