యూనిఫాం.. కొత్త రూపం
● మార్పులు చేస్తూ ఆదేశాలు ● కుట్టు పని స్వయం సహాయక సంఘాలకే.. ● ప్రభుత్వ పాఠశాలల్లో 45,807 మంది బాలబాలికలు
మంచిర్యాలఅర్బన్: వచ్చే విద్యాసంవత్సరంలో ప్ర భుత్వ పాఠశాలలు ప్రారంభించే నాటికే విద్యార్థుల కు యూనిఫాం అందించేందుకు విద్యాశాఖ కసర త్తు చేస్తోంది. 2025–26 విద్యాసంవత్సరం పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన యూనిఫాం డిజై న్లు మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బాలబాలికలకు వేర్వేరు డిజైన్లలో దుస్తులు కుట్టించి అందించనున్నారు. చొక్కాలు, లాంగ్‌ఫ్రాక్‌లకు పట్టీలు, భుజ పట్టీలపైన కప్స్, ప్యాచ్‌వర్క్స్ లేకుండా సాధారణ యూనిఫాంలను డిజైన్‌గా మార్చారు. కుట్టుపని బాధ్యతలను స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)కు అప్పగించనున్నారు.
సకాలంలో ముడివస్త్రం వస్తేనే..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు ఉచితంగా అందిస్తున్నారు. ప్రతియేటా ఏదో కారణంగా విద్యార్థులకు సకాలంలో అందకుండా పోతున్నాయి. హైదరాబాద్ నుంచి జిల్లాకు వస్త్రం సరఫరా నుంచి కుట్టడం వరకు ఆలస్యం అవుతున్నాయి. మహిళా పొదుపు సంఘం సభ్యులకు దుస్తులు కుట్టించే బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో ముడిసరుకు సరఫరాలో ఆలస్యం, సమయం తక్కువగా ఉండడం, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల దుస్తులు కుట్టడంలో జాప్యం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పొదుపు మహిళా సంఘాలకు అప్పగించారు. ముడివస్త్రం అరకొరగా రావడమో ఏమోగానీ విద్యార్థులకు అందించే రెండు జతల్లో ఒక జత బడి తెరిచే నాటికి విద్యార్థులకు అందించినప్పటికీ రెండో జత అందించడంలో జాప్యం జరిగింది. ఈ ఏడాదైనా ముడివస్త్రం వస్తేనే విద్యార్థులకు రెండు జతలు అందే వీలుంటుంది.
మారిన దుస్తుల ఆకృతి
వచ్చే విద్యాసంవత్సరం(2025–26)లో పిల్లలకు అందించే దుస్తుల ఆకృతిలో మార్పులు చేశారు. గతేడాది దుస్తుల ఆకృతిని బాలబాలికలకు తరగతుల వారీగా మూడు రకాలుగా, బాలురకు రెండు రకాలుగా విభజించారు. దుస్తుల ఆకృతితో ప్రభుత్వం చెల్లించే ధరలు గిట్టుబాటు ధర కాకపోవడం.. సమయం ఎక్కువగా తీసుకోవడంతో ప్రభుత్వం డిజైన్లు మార్పులు చేసింది. బాలికలకు ఒకటి నుంచి 3వ తరగతి వరకు లాంగ్‌ఫ్రాక్ చొక్కా, 4నుంచి 5వ తరగతి వరకు షర్టు స్కట్, 6నుంచి 12వ తరగతి పంజాబీ(టాప్, బాటమ్) చున్నీ లేకుండా, బాలురకు 1నుంచి 7వ తరగతి వరకు చొక్కా లాగు, 8నుంచి 12వ తరగతి వరకు చొక్కా, ప్యాంటు సాధారణ డిజైన్లు చేశారు. ఇదివరకు చొక్కాలు, లాంగ్ ఫ్రాక్‌లకు పట్టీలు, భుజాలపైన కప్స్ వంటి ప్యాచ్ వర్క్‌లతో సమయం సరిపోకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని పాఠశాలల్లో జేబులు ఊడిపోవడం.. పట్టీలు తెగిపోవడం.. దారం పోగులు లేచి అసౌకర్యంగా మారాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సాధారణ డిజైన్‌గా మార్చడంతో కుట్టేందుకు సరళంగా ఉండడంతోపాటు మహిళలకు పని సులభతరం కానుందని మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు.
యూనిఫాంలు అందించే విద్యార్థుల వివరాలు
పాఠశాలలు 778
బాలురు 22,058
బాలికలు 23,749
మొత్తం విద్యార్థులు 45,807
మండలాల వారీగా...
మండలం విద్యార్థుల సంఖ్య..
బెల్లంపల్లి 4,708
భీమిని 1,302
భీమారం 978
చెన్నూర్ 2,848
దండేపల్లి 3,241
హాజీపూర్ 1,900
జైపూర్ 2,094
జన్నారం 4,048
కన్నెపల్లి 1,652
కాసిపేట 2,347
కోటపల్లి 2,587
లక్సెట్టిపేట 2,986
మంచిర్యాల 4,927
మందమర్రి 3,418
నస్పూర్ 1,399
నెన్నెల 1,924
తాండూర్ 2,154
వేమనపల్లి 1,299
Comments
Please login to add a commentAdd a comment