బాలల సంరక్షణపై ప్రత్యేక దృష్టి
● ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు
నస్పూర్: జిల్లాలోని బాలల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. పట్టణ పరిధిలో నూతన బాలసదనం భవన నిర్మాణానికి ఆయన కలెక్టర్ కుమార్‌దీపక్, డీసీపీ భాస్కర్‌లతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మిషన్ వాత్సల్య నిధులు రూ.1.34కోట్లతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలు, పిల్లల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌శాఖ ఈఈ పి.రామ్మోహన్‌రావు, డీఈ రాజ్‌కుమార్, ఈఈ కుర్షిద్ అన్వర్, నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సురిమిల్ల వేణు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
మంచిర్యాలటౌన్: ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పేరిట మహిళా దినోత్సవం కానుకగా చేపడుతున్న కార్యక్రమాలతో మహిళల సంక్షేమానికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నా రు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తల్లి స్ఫూర్తిగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment