కుటుంబంలో మహిళల పాత్ర కీలకం
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాలఅగ్రికల్చర్: కుటుంబాన్ని తీర్చిదిద్దడం నుంచి దేశాన్ని పాలించే వరకు అన్ని రంగాల్లో మహిళల పాత్ర కీలమైనదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో డీసీపీ ఏ.భాస్కర్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్‌ఖాన్‌లతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మా ట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు సా మాజికంగా ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని, దేశ ప్రథమ పౌరురాలి స్థానంతోపాటు ముఖ్య మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ, నేవి, ఎ యిర్‌ఫోర్స్, శాస్త్రవేత్తలుగా రాణిస్తున్నారని, ప్ర తీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. లింగ భేదం లేకుండా అబ్బాయిలు, అమ్మాయిలను ఒకేలా చూస్తూ సమాన అవకా శాలు కల్పించాలని అన్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన మహిళా అధికా రులు, ఉద్యోగులను ప్రశంసాపత్రాలు, శాలు వాలతో సత్కరించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
Comments
Please login to add a commentAdd a comment