ఇస్రో పిలుస్తోంది!
● అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన ● తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం ● యువికా కార్యక్రమానికి 23వ తేదీ తుది గడువు
మంచిర్యాలఅర్బన్: అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఏటా ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా)–25 పేరిట నిర్వహిస్తోంది. మే 19 నుంచి 30 ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ ఏడా ది దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి విద్యార్థులను ఆ హ్వానిస్తోంది. మార్చి 23 తేదీలోపు www. isro. gov. in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు వడపోత అనంతరం ఏప్రిల్ 7న ఎంపికై న వారి జాబితా విడుదల చేస్తారు. తర్వాత 14 రో జులపాటు అవగాహన తరగతులు నిర్వహిస్తారు.
ఎంపిక ఇలా..
ఆయా పాఠశాలలో ప్రస్తుతం మార్చి 1, 2025 నాటికి తొమ్మిదో తరగతి చదువుతూ ఉండాలి. విద్యతోపాటు సహపాఠ్యంశాలపై మంచి పట్టు ఉండాలి. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పెస్, సైన్స్‌క్లబ్‌లో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్‌సీసీ స్వ్కాట్ అండ్ గౌడ్ విభాగంలో 5 శాతం, పల్లె ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం ఇస్తారు.
ఎంపికై న విద్యార్థులకు..
ఇస్రో నిర్వహిస్తున్న యువికా కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులకు ప్రయాణం భోజనం, వసతి సౌకర్యాలు ఇస్రో ఉచితంగా అందజేస్తోంది. వారికి మే నెలలో 14 రోజుల పాటు ఇస్రో స్పెస్ సెంటర్లకు తీ సుకెళ్తారు. అక్కడ స్పెస్‌కు సంబంధించి విశేషాలు, సప్తగ్రహ కూటమి, తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో ముఖాముఖీగా మాట్లాడే అవకాశం విద్యార్థులకు ఉంటుంది.
ఏడు కేంద్రాల్లో నిర్వహణ
ఇస్రో ఈకార్యక్రమాన్ని దేశంలో ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్‌ఎస్‌సీ) తిరువనంతపురం, యూఆర్‌ఎస్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) బెంగుళూరు, స్పేస్ ఆఫ్లికేషన్ సెంటర్ (ఎస్‌ఏసీ) ఆహ్మదాబాద్, నేషనల్ రిమోట్ సె న్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) హైదరాబాద్, ఈశన్యస్పెస్ ఆఫ్లికేషన్ సెంటర్(ఎన్‌ఈ–ఎస్‌ఏసీ) శి ల్లాంగ్, ఎస్‌డీఎస్‌సీ శ్రీహరికోట, ఐఐఆర్‌ఎస్ డెహ్రడూన్‌లో అవగాహన తరగతులు నిర్వహిస్తోంది.
విద్యార్థులకు అవకాశం
యువికా ద్వారా విద్యార్థులకు చక్కటి అవకాశం కల్పిస్తోంది. 150 మందికి అవగాహన తరగతులు నిర్వహిస్తారు. నిపుణులు, శాస్త్రవేత్తలతో అంతరిక్ష విజ్ఞానంపై బృందచర్చ, ప్రాక్టికల్ ఫీడ్ బ్యాక్ తరగతులు చూపిస్తారు. ఆయా ప ట్టణాల్లో ఇస్రో ప్రయోగ కేంద్రాలు, ప్రయోగశాలలను చూపిస్తారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి మధుబాబును సంప్రదించాలి.
– యాదయ్య, డీఈవో, మంచిర్యాల
ఇస్రో పిలుస్తోంది!
Comments
Please login to add a commentAdd a comment