చెరువులో పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చెరువులో పడి వ్యక్తి మృతి

Published Mon, Mar 10 2025 10:33 AM | Last Updated on Mon, Mar 10 2025 10:29 AM

చెరువ

చెరువులో పడి వ్యక్తి మృతి

సోన్‌: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై గోపి కథనం ప్రకారం..మండలంలోని సిద్దలకుంటకు చెందిన దేవోల్ల శ్రీను(30) శనివారం మాదాపూర్‌, సిద్దులకుంట గ్రామాల శివారులో చెరువులో చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. మృతుడి బావ ఫిర్యాదుతో ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

విద్యుత్‌షాక్‌తో వివాహిత..

లక్సెట్టిపేట: స్నానానికి వేడి నీళ్లు పెడుతుండగా విద్యుత్‌ షాక్‌తో వివాహిత మృతిచెందింది. ఎస్సై సతీశ్‌ కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన గంధం తిరుమల(42), తిరుపతి భార్యభర్తలు. ఇద్దరు పిల్లల సంతానం. భర్త కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఉదయం తిరుమల స్నానం చేసేందుకు బకెట్‌లో నీళ్లు పోసి వాటర్‌ హీటర్‌ వేసి స్విచ్‌ ఆన్‌ చేసింది. ఆమె కాలు బకెట్‌ను ఆనుకుని ఉండడంతో విద్యుత్‌ సరఫరా అయి షాక్‌కు గురైంది. కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

తిర్యాణి: అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తితో కానిస్టేబుల్‌ గడ్డి మందుతాగిఆత్మహత్యాయత్నంచేశాడు. ఈ ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్‌కథనంప్రకారం..మంచిర్యాల జిల్లా రాజంపేట గ్రామానికి చెందిన ముద్దసాని పవన్‌(25)2024లో టీఎస్‌ఎస్పీలో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. తిర్యాణి పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంత కాలంగా కళ్లలో మంట, తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో ఆదివారం బయటికి వెళ్లిన పవన్‌ తిర్యాణి, తాండూర్‌ మార్గమధ్యలో గడ్డి మందు తాగాడు.గమనించిన కొందరుపోలీసులకుసమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకునితిర్యాణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచనలతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

బైక్‌ చోరీ

ఆదిలాబాద్‌టౌన్‌: పట్టణంలోని అశోక్‌రోడ్‌ కాలనీకి చెందిన బి.కిషన్‌ బైక్‌ చోరీకి గురైంది. ఈనెల 8నకూరగాయల మార్కెట్‌లో పార్కింగ్‌ చేసి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి కనిపించలేదు. చుట్టూపక్కల గాలించిన దొరకకపోవడంతో బాధితుడు ఆదివారం వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సునీల్‌కుమార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
చెరువులో పడి వ్యక్తి మృతి
1
1/1

చెరువులో పడి వ్యక్తి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement