విజయవంతంగా ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం
బాసర: ఆర్జీయూకేటీలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం, ఎన్‌ఐటీటీటీఆర్ చండీగఢ్‌తో కలిసి ఈనెల 3 నుంచి 7వ తేదీ వరకు ‘ఉచిత సిమ్యులేటర్లను ఉపయోగించి ఈసీఈ ల్యాబ్ సబ్జెక్టులు బోధించడం‘అనే అంశంపై ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం విజయవంతంగా ముగిసింది. ఆదివారం ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు కార్యక్రమంలో ఇన్‌చార్జి వీసీ, ప్రొఫెసర్ గోవర్ధన్ మాట్లాడారు. సిమ్యులేటర్లలో వర్చువల్ ల్యాబ్‌లు, మల్టీసిమ్‌లైవ్, ల్యాబ్‌లైవ్, టింకర్‌క్యాడ్, వా వ్కి, సైల్యాబ్, ఆరెంజ్, నోడ్ రెడ్, మస్కిటో, ఈజీఈడీఏ సిమ్8085 ప్రదర్శనలో ఉన్నాయన్నారు. విద్యార్థులు నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలన్నారు. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీధర్శన్ ఏవో రణధీర్, అసోసియేట్ డీన్‌లు చంద్రశేఖర్రావు, మహేశ్ తదితరులు ఉన్నారు.
క్లుప్తంగా
తాళం వేసిన ఇంట్లో రూ.లక్ష చోరీ
భైంసాటౌన్: పట్టణంలోని పాండ్రిగల్లిలో తా ళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. పట్టణ ఎస్సై శ్రీనివాస్ యాదవ్ కథనం ప్రకారం..కాలనీకి చెందిన పాలెపోల గంగాదాస్ ఈనెల 6న సా యంత్రం ఇంటికి తాళం వేసి కుభీర్‌లో శుభకార్యం నిమిత్తం వెళ్లారు. ఆదివారం ఉదయం తాళం పగులగొట్టి ఉండడం గమనించిన ప క్కింటివారు గంగాదాస్‌కు సమాచారమిచ్చా రు. దీంతో ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో వస్తువులు, బీరువా చిందరవందరగా ఉండడం చూసి పోలీసులకు సమాచారమివ్వగా, వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బెడ్రూంలోని బీరువా నుంచి రూ.లక్ష వరకు నగదు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment