ఎడ్లబండిని ఢీకొట్టిన బైక్
● ఒకరు మృతి
బజార్‌హత్నూర్: ఎడ్లబండిని బైక్ ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందాడు. ఎస్సై అప్పారావ్ కథనం ప్రకారం.. మండలంలోని కొలారి గ్రామానికి చెందిన కాలే కాశీనాథ్ (54) బైక్‌పై మండల కేంద్రానికి వెళ్లాడు. పని ముగించుకుని స్వగ్రామానికి వస్తున్నాడు. శనివారం రాత్రి కొలారి సమీపంలో బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న ఎడ్లబండిని ఢీకొట్టాడు. తీవ్రగాయాలైన కాశీనాథ్‌ను వెంటనే బజార్‌హత్నూర్ పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం 108లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment