బెల్లంపల్లి: శాంతిఖని లాంగ్‌వాల్ ప్రాజెక్టుపై ప్రజా ప్రతినిధులు తమ వైఖరి చెప్పాలని బెల్లంపల్లి మాజీ ఎంపీపీ గోమాస శ్రీనివాస్, ప్రభావిత గ్రా మాల రైతులు డిమాండ్ చేశారు. బెల్లంపల్లి ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. లాంగ్‌వాల్ ప్రాజెక్టు వల్ల ఆకెనపల్లి, పాతబెల్లంపల్లి, లింగాపూర్, తాళ్లగురిజాల, బట్వాన్‌పల్లి, పెర్కపల్లి గ్రామాలు ప్రభావితం అవుతాయని తెలిపారు. ఆ గ్రామాల్లో సాగు, తాగునీటి కష్టాలు ఎదురవుతాయన్నారు. చెరువుల్లో ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటిపోయిందన్నారు. పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణలో రైతులు, ప్రజలు పాల్గొని ఈ ప్రాజెక్టు వద్దని నిరసన తెలిపినా ఎమ్మెల్యే వినోద్, ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభావిత గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో ప్రభావిత గ్రామాల వాసులు రామటెంకి ప్రసాద్, గోమాస వినోద్‌కుమార్, దుర్గం జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment