గూడేల్లో ‘పులారా’ ఉత్సవం
కెరమెరి(ఆసిఫాబాద్): ఉమ్మడి జిల్లాలోని ఆదివాసీ గూడేల్లో గురువారం సంప్రదాయబద్ధంగా పులారా ఉత్సవం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతీ ఇంటి నుంచి కుడుకలను తీసుకువచ్చి గ్రామ పటేల్‌కు ఇచ్చారు. అంతకు ముందే అడవి నుంచి తీసుకువచ్చిన రెండు వెదురు బొంగులకు మాతారా, మాతరల్‌గా నామకరణం చేసి వాటికి కుడుకలు, గారెలు, వంకాయలు, ఉల్లిగడ్డలు, చక్కెర బిళ్లలు అమర్చారు. ఆయా గ్రామాల గ్రామ పటేళ్లు వాటికి పూజలు చేశారు. ఆ తర్వాత వాటికి మంటపెట్టారు. ఆచారం ప్రకారం కొందరు యువకులు వరుసగా అందులోంచి దూకారు. అనంతరం డోలు, సన్నాయిలతో కాముడి దహనం వరకు వెళ్లారు. గ్రామంలోని ప్రతీ కుటుంబం రొట్టెలు, పప్పులు తీసుకువచ్చి కాముని దహనం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. సహపంక్తి భోజనం చేశారు. రాత్రంతా అక్కడే బస చేశారు. అక్కడున్న బూడిదను ఎవరూ దొంగిలించకుండా కాపాడారు. నేడు దురాడి (రంగులు చల్లుకోవడం)సంబరాలు జరుపుకోనున్నారు.
గిరిజన సంప్రదాయాలతో పూజలు
ఘనంగా కాముని దహనం
గూడేల్లో ‘పులారా’ ఉత్సవం
Comments
Please login to add a commentAdd a comment