మద్యం మత్తులో ఒకరు ఆత్మహత్య
బెజ్జూర్: మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కావుడే లస్మయ్య (52) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరులేని సమయంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య కమలాబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
వృద్ధుడు బలవన్మరణం
తాండూర్: మనస్తాపంతో పురుగుల మందు తాగి వృద్ధుడు బలవన్మరణం చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్ తెలి పిన వివరాల మేరకు మండలంలోని గోపాల్ నగర్‌కు చెందిన రావుల సాంబయ్య (60) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈక్రమంలో నిత్యం మద్యం సేవించి ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. గురువారం మద్యం సేవించి భార్య కౌసల్యతో గొడవ పడడంతో ఆమె మందలించింది. దీంతో మనస్తాపానికి గురై గ్రామ శివారులోని చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుమారుడు సంపత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
జగిత్యాల ఇన్‌చార్జిగా ప్రదీప్
కాసిపేట: కాసిపేట మండల కేంద్రానికి చెందిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రత్నం ప్రదీప్‌ను జగిత్యాల జిల్లా ఇన్‌చార్జిగా నియమిస్తూ రాష్ట్ర యూత్‌కాంగ్రెస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులను జిల్లాల ఇన్‌చార్జీలుగా నియమిస్తూ ఈనెల 12న ఉత్తర్వులు వెలువడ్డాయి.
మద్యం మత్తులో ఒకరు ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment