గంజాయి కేసులో ఆరుగురు అరెస్ట్
భీమారం(చెన్నూర్): మంచిర్యాల జిల్లా భీమారంలో గంజాయి కేసులో ఆరుగురు యువకులను అరెస్టు చేసినట్లు డీసీపీ భాస్కర్ తెలిపారు. గురువారం జైపూర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. మంచిర్యాల–చెన్నూరు జాతీయరహదారిలో భీమారం ప్రభుత్వ కలప డిపో వద్ద దుర్గం సందీప్, దుర్గం సంజయ్, వనపర్తి కరుణాసాగర్, రావుల ఆదర్శ్ అనుమానాస్పదంగా కనిపించడంతో ఎస్సై శ్వేత వారిని తనిఖీ చేయగా కిలోన్నర గంజాయి లభించింది. చెడు వ్యసనాలకు అలవాటుపడిన కాసిపేటకు చెందిన సందీప్, అంకుసాపూర్‌కు చెందిన సంజయ్ మహారాష్ట్రలోని చంద్రాపూర్ రైల్వేస్టేషన్ సమీ పంలో గుర్తుతెలియని వ్యక్తులవద్ద గంజాయి కొనుగోలు చేసి ఇక్కడ విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. ఈనెల 11న ఇద్దరూ కలిసి చంద్రాపూర్‌లో కిలోన్నర గంజాయి కొనుగోలు చేసి గురువారం భీమారంలో కిష్టంపేటకు చెందిన వనపర్తి కరుణాసాగర్, రావుల ఆదర్శ్‌కు విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ నలుగురితో పాటు భీమారంకు చెందిన రాంటెంకి స్వస్తిక్‌కుమార్, జువేరి శ్రీనివాస్‌ను బస్టా ండ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజ రు పర్చినట్లు డీసీపీ తెలిపారు. సమావేశంలో ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్సై శ్వేత పాల్గొన్నారు.
గంజాయి పట్టివేత
గుడిహత్నూర్(బోథ్): మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద గురువారం సాయంత్రం గంజాయి విక్రయిస్తున్న మహిళతో పాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సీఐ భీమేష్, ఎస్సై మహేందర్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన తిడికే రంజనాతో పాటు వినాయక్ గంజాయి పొట్లాలు అమ్ముతుండగా తమకు అందిన సమాచారం మేరకు పట్టుకుని వారి వద్ద నుంచి 450 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment