తల్లీకూతురు ఆత్మహత్యాయత్నం
● చికిత్స పొందుతూ తల్లి మృతి ● కూతురు పరిస్థితి విషమం
మంచిర్యాలక్రైం: మద్యం మత్తులో తల్లీకూతురు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. కూతురు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చున్నంబట్టి వాడలో చోటు చేసుకుంది. సీఐ ప్రమోద్‌రావు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని చున్నంబట్టివాడ వందఫీట్ల రోడ్‌లో నివాసం ఉంటున్న పస్తం పోశమ్మ (80) భర్త భీమయ్య పదేళ్ల క్రితమే చనిపోగా రాజమ్మ వివాహమైన కొద్దిరోజులకే భర్తను వదిలిపెట్టి తల్లితో కలిసి ఉంటోంది. ఇద్దరూ కలిసి ప్లాస్టిక్ బాటిళ్లు, చెత్త కాగితాలు ఏరుకుంటూ అవి విక్రయించగా వచ్చిన డబ్బులతో మద్యం సేవించి గొడవపడేవారు. బుధవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన అనంతరం ఇద్దరూ గొడవపడ్డారు. మాటామాట పెరగడంతో క్షణికావేశంలో ఇద్దరూ పురుగుల మందు తాగారు. ఇద్దరి గొడవ వినిపించకపోవడంతో కొంతసేపటికి సమీపంలోనే ఉంటున్న పోశమ్మ మనవడు భీమేశ్ వెళ్లి చూడగా ఇద్దరూ అపస్మారక స్థితిలో పడిఉన్నారు. వెంటనే ఆటోలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పోశమ్మ గురువారం మృతి చెందింది. రాజమ్మ పరిస్థితి విషమంగా ఉంది. పోశమ్మ కుమారుడు గంగారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment