ఐకే1ఏ గనిలో కార్మికుడికి గాయాలు
జైపూర్: ఇందారం ఐకే1ఏ గనిలో గురువారం జరిగిన ప్రమాదంలో సపోర్టుమెన్ కార్మికుడు అంగల రాజయ్యకు గాయాలయ్యాయి. ఉదయం షిఫ్టు విధులుకు వచ్చిన రాజయ్య గనిలో ఎన్–8 ప్యానెల్ 13డీప్ ఆఫ్ సెవెన్ లెవల్‌లో పని చేస్తుండగా హఠాత్తుగా సైడ్ ఫాల్ కావడంతో గాయాలయ్యాయి. తోటి కార్మికులు రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌కు తరలించారు. కార్మికుడిని ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్ నాయకులు పరామర్శించారు. పర్యవేక్షణ లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని, అందుకు కారకులపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎంఎస్ కేంద్రకమిటీ నాయకులు తిప్పరపు సారయ్య డిమాండ్ చేశారు.
ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి
చింతలమానెపల్లి: పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి చెందినట్లు ఎస్సై ఇస్లావత్ నరేశ్ తెలిపారు. మండలంలోని లంబాడిహేటి గ్రామానికి చెందిన అజ్మీర శాంతాబాయి (53) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈక్రమంలో అప్పులు కావడంతో జీవితంపై విరక్తి చెంది ఈనెల 11న మంగళవారం ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి గురువారం తెల్లవారు జామున మృతి చెందింది. మృతురాలి కుమారుడు అజ్మీర ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.
విద్యుత్ షాక్‌తో ఒకరు..
ఆదిలాబాద్‌రూరల్: విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందిన సంఘటన మావల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొజుర్ రంజిత్ (35) మావల మండల కేంద్రంలో నివాసం ఉంటున్నాడు. మేసీ్త్ర పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో కూలర్ స్విచ్ వేయడంతో షాక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుని భార్య జోశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విష్ణువర్ధన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment