సికిల్‌సెల్ నిర్మూలనే లక్ష్యం
ఆదిలాబాద్‌టౌన్: సికిల్‌సెల్ నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని బ్లడ్ సెల్ రాష్ట్ర ప్రోగ్రాం అధికారి డాక్టర్ హీన దీక్షిత్ అన్నారు. డీఎంహెచ్‌వో సమావేశ మందిరంలో సికిల్‌సెల్‌పై జిల్లా స్థాయి టీవోటీ శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2047 వరకు సికిల్‌సెల్ (ఎనీమియా) అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. సికిల్‌సెల్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది, దాన్ని ఎలా అరికట్టాలో మాస్టర్ ట్రైనర్ హెమటలాజీ ప్రొఫెసర్ రాధిక ప్రొజెక్టర్ ద్వారా మెడికల్ ఆఫీసర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎన్‌సీడీ ప్రొగ్రామ్ అధికారి శ్రీధర్, ఏటీడీవో అనిల్, మెడికల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment