ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను అధికారులు సమన్వయంతో త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణలతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ దరఖాస్తు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
● కన్నెపల్లి మండలం చింతపూడి లింగాల గ్రామంలో గుడుంబా, బెల్ట్‌షాపుల నిర్వహణతో యువత పెడదారి పడుతున్నారని, గుడుంబా, మద్యం విక్రయాలు నియంత్రించాలని గ్రామస్తులు కలెక్టర్‌ను కోరారు.
● హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ కార్మికులకు అందిస్తున్న వేతనాలను మంచిర్యాల మున్సిపల్ కార్మికులకు అందించాలని జిల్లా మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు.
● కుటుంబ సర్వే దరఖాస్తుల డేటా ఎంట్రీ డబ్బులు ఇప్పించాలని మంచిర్యాలకు చెందిన సురేష్‌కుమార్ దరఖాస్తు అందజేశారు.
● విద్యార్థినులు, ఉపాధ్యాయినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆరోపణల నేపథ్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్‌ను విధుల్లో నుంచి తొలగించాలని, బెల్లంపల్లి ఎస్సీ బాలుర పోస్టుమెట్రిక్ వార్డెన్ కోరుట్ల శ్రీనివాస్ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి మృతిచెందాడని, వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.శ్రీకాంత్, సికిందర్, బ్రహ్మానందం, శంకర్ కోరారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
Comments
Please login to add a commentAdd a comment