ఎస్సీ వర్గీకరణ కోసం రిలే నిరాహార దీక్ష
బెల్లంపల్లి: ఎస్సీ వర్గీకరణ పూర్తిస్థాయిలో చేపట్టాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని ఏఎంసీ క్రీడామైదానం ఎదురుగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టా రు. పట్టణ అధ్యక్షుడు రామగిరి మహేష్ ఆధ్వర్యంలో మాదిగ శ్రేణులు దీక్ష చేఽశారు. దీక్షా శిబి రాన్ని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ సరిగా చే పట్టలేదన్నారు. ఏ, బీ, సీ, డీ చేయాల్సి ఉండగా ఏ, బీ, సీ చేసి చేతులు దులిపేసుకుందని అ న్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం వర్గీకరణ జరగాల్సి ఉండగా అశాసీ్త్రయంగా చేశారని పేర్కొన్నారు. ఈ కారణంగా మాదిగలు, ఉపకులాల కు అన్యాయం జరిగిందని, ఆ అన్యాయాన్ని స రి చేయాలని డిమాండ్ చేశారు. మాదిగలకు మంత్రివర్గంలో రెండు మంత్రి పదవులు ఇవ్వాలన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు జిలకర శంకర్, మచ్చ రాజేష్, నాతరి శివ, పుల్లూరి రా ము, బి.రవీందర్, బి.రాంచందర్, రామకృష్ణ, పద్మక్క, రాజలింగు, భూమయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment