వేలంలో పాల్గొంటేనే సింగరేణి మనుగడ
● ఏఐటీయూసీ అధ్యక్షుడు వీ.సీతారామయ్య
శ్రీరాంపూర్: బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొంటేనే సంస్థకు మనుగడ ఉంటుందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. సోమవారం ఆయన ఆర్కే 5గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్‌లో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త బొగ్గు గనుల చట్టం ప్రకారమే గనులు కేటాయిస్తారని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి వేలంలో పాల్గొనేలా యాజమాన్యాన్ని ఆదేశించాలని అన్నారు. డైరెక్టర్(పా), ిసీఎండీ, జేసీసీ సమావేశాల్లో కార్మికుల ప్రధాన డిమాండ్లను యా జమాన్యం ముందుంచామని తెలిపారు. కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని, అలవెన్స్‌లపై ఆదాయ పన్నును సంస్థనే చెల్లించాలని, మెడికల్ అన్‌ఫిట్ మైనింగ్‌స్టాఫ్, టెక్నికల్ సూపర్‌వైజర్లకు సర్ఫేస్‌లో సూటబుల్ జాబ్ ఇవ్వాలని, 11 రకాల అలవెన్స్‌లను పెంచాలని తదితర డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.33 వేల కోట్ల బకాయిలను సింగరేణికి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముష్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీసైదా, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, ఏరియా కార్యదర్శి ప్రసాద్‌రెడ్డి, ఫిట్ కార్యదర్శి గునిగంటి నర్సింగరావు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్‌ఖాన్, నాయకులు అద్దు శ్రీనివాస్, గొల్లపల్లి రామచందర్, సత్తిరెడ్డి భోగ మదనయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment