ఫార్మాసిస్టులు బాధ్యతగా వ్యవహరించాలి
మంచిర్యాలటౌన్: మందుల పంపిణీ, వ్యాక్సి న్లు నిల్వ చేయడంలో ఫార్మాసిస్టులు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శా ఖ అధికారి డాక్టర్ హరీశ్‌రాజ్ అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయంలో సోమవారం జి ల్లాలోని ఫార్మసిస్టులకు ఎనీమియా ముక్త్ భారత్‌పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ జిల్లాలోని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా ఆసుపత్రి ఫార్మాసిస్టులు సూపర్ చైన్ మేనేజ్‌మెంటు వ్యాక్సినేషన్‌పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. వాతావరణ మార్పులతో కీటక జనిత వ్యాధులు, అసంక్రమణ వ్యా ధులు వచ్చే వీలుండడంతో వాటికి సంబంధించిన మందులను నిల్వ ఉంచుకోవాలని తెలిపా రు. ప్రతీ ఆరోగ్య కేంద్రంలో రోజూ తీసుకున్న మందులు, వ్యాక్సిన్ వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కృపాబాయి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ అనిత, జిల్లా ఫార్మాసిస్టు డాక్టర్ ప్రసాద్, డీపీహెచ్‌ఎన్ పద్మ, డెమో వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment