ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
మంచిర్యాలటౌన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతాయని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సోమవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఆరోగ్యశ్రీ వార్డు, డయాలసిస్, ల్యాబ్, మందుల నిల్వలు, రిజిష్టర్లు, హాజరు పట్టిక, ఆసుపత్రి ఆవరణను పరిశీలించారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్య సేవలపై తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆవరణలో నూతన భవనం నిర్మాణం మరో మూడు నెలల్లోపు పూర్తయి అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరీశ్‌చంద్రారెడ్డి, ఆర్‌ఎంవో డాక్టర్ భీష్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment