
గురువుకు ఘనంగా సెండాఫ్
తలమడుగు: మండలంలోని దేహగమలో పదవీ విరమణ పొందిన గురువుకు గ్రామస్తులు సెండాఫ్ ఘనంగా ఇచ్చారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా సేవలందించిన ముస్కు సంజీవరెడ్డి దంపతులను మంగళవారం గ్రామస్తులు ఎడ్లబండిపై ఊరేగించారు. అనంతరం ఉపాధ్యాయ సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మ లచ్చిరాం, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడుతూ ముస్కు సంజీవరెడ్డి 27 ఏళ్లుగా పేద విద్యార్థులకు అందించిన సేవలు అభినందనీయమన్నారు. విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. ఆయన సేవలు ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో వెంకట్‌రావు, టీయూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జలంధర్‌రెడ్డి, లింగారెడ్డి, రామారావు, మౌనిష్‌రెడ్డి, రాంరెడ్డి, దేవన్న, త్రియంబక్, తదితరులు పాల్గొన్నారు.