
బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం
చెన్నూర్‌రూరల్: మండలంలోని కిష్టంపేటలో శనివారం రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కేంద్రం నిధులతోనే సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారని, అందు కు ప్రతీ రేషన్ షాపు వద్ద బీజేపీ నాయకులు ప్రధాని నరే ంద్ర మోదీ చిత్రపటం ఏర్పాటు చేసి క్షీరాభిషేకం చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు మోదీ ఫ్లెక్సీని తొలగించడంతో ఇరుపార్టీల నాయకుల మధ్య వాగ్వా దం చోటు చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరుపార్టీల నాయకులను శాంతింపజేశారు.

బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం