
నాగోబాకు జలాభిషేకం
ఇంద్రవెల్లి: చైత్రమాసాన్ని పురస్కరించుకుని బుధవారం మండలంలోని కేస్లాపూర్ నాగోబా దేవతకు జలాభిషేకం చేశారు. కేస్లాపూర్ గ్రామానికి చెందిన ఏడుగురు యువతులు పవిత్రమైన కోనేరు నీటిని తీసుకెళ్లి నాగోబాకు జలాభిషేకం చేశారు. చైత్రమాసంలో నిర్వహించే గావ్‌సాత్ (పోచ్చమ్మ) తల్లిపూజలకు ముందు ఐదురోజుల పాటు జలాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోందని గ్రామ పటేల్ మెస్రం వెంకట్‌రావ్ తెలిపారు. ఈ నెల 13 వరకు అభిషేకం చేసిన అనంతరం గ్రామంలో గావ్‌సాత్(పోచ్చమ్మ) పూజలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.