మెదక్ మున్సిపాలిటీ: దేవుళ్లకు మొక్కులు మొక్కంగా 14 ఏళ్లకు ఆ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క మగబిడ్డపుట్టాడు. అల్లారుముద్దుగా పెంచుతున్నారు. డెంగీతో మృత్యువాతపడటంతో వారు కన్నీరుమున్నీరు అవుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ పట్టణంలోని వెంకట్రావు కాలనీకి చెందిన చింతకింది చిన్న శ్రీనివాస్‌గౌడ్, మాధవి దంపతులకు 14 ఏళ్లకు బాబు పుట్టాడు. పార్థసాయిగౌడ్ నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. శ్రీనివాస్ అన్నదమ్ములకు కూడా మగ సంతానం లేకపోవడంతో బాబును ఎంతో అప్యాయంగా చూసేవారు.
అందరూ కలిసి బాబును కంటికి రెప్పలా కాపాడుకునేవారు. స్థానికంగా ఉన్న సిద్ధార్థ్ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. వారం రోజులుగా జ్వరం వస్తుండటంతో బాలుడిని ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. జ్వరం తగ్గక పోవడంతో వైద్య పరీక్షలు చేయగా డెంగీగా తేలింది. దీంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ప్లెట్‌లెట్స్ తగ్గి బ్రెయిన్‌డెడ్ కావడంతో బుధవారం మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment