ఎమ్మెల్సీ రేసులో సీపీఐ | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ రేసులో సీపీఐ

Published Fri, Mar 7 2025 9:38 AM | Last Updated on Fri, Mar 7 2025 9:34 AM

ఎమ్మెల్సీ రేసులో సీపీఐ

ఎమ్మెల్సీ రేసులో సీపీఐ

‘చాడా’కు చాన్స్‌ దక్కేనా?

సాక్షి, సిద్దిపేట: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్సీ స్థానాల్లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌ రెడ్డికి అవకాశం దక్కుతుందా లేదా అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌, సీపీఐ పొత్తు పెట్టుకున్నాయి. అందులో రెండు ఎమ్మెల్సీలకు అవకాశం ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్సీలు హసన్‌ మీర్జా, ఎగ్గె మల్లేఽశం, శేరి సుభాష్‌రెడ్డి, మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ పదవీకాలం ఈ నెల 29వ తేదీతో ముగయనుంది. దీంతో రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. వాటిని భర్తీ చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ గత నెల 28న షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ నెల 10న నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన, 13న నామినేషన్ల పరిశీలన, 20న పోలింగ్‌ ఉండనుంది. ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్‌కు 4, బీఆర్‌ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు దక్కే వాటిలో సీపీఐకి ఒకటి అవకాశం ఇవ్వాలని ఇప్పటికే సీపీఐ నేతలు సీఎం రేవంత్‌రెడ్డిని, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ను కలిశారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ నాయకులు చాడా వెంకట్‌రెడ్డి, తక్కల్లపల్లి శ్రీనివాస్‌రావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

సీపీఐ మొదట పట్టుబట్టిన

హుస్నాబాద్‌ సీటు..

అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్‌, సీపీఐ పార్టీల పొత్తులో భాగంగా హుస్నాబాద్‌ ఎమ్మెల్యే సీటును సీపీఐకి కేటాయించాలని పట్టు పట్టా రు. హుస్నాబాద్‌, కొత్తగూడెంలలో సీపీఐకి పట్టు ఉండటంతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆ పార్టీ రెండు స్థానాలను అడిగారు. చివరకు హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ అ భ్యర్థిగా పొన్నం ప్రభాకర్‌కు కేటాయించారు. పొత్తులలో కొత్తగూడెం సీటును కూనంనేని సాంబశివరావు కు కేటాయించారు. సీపీఐ అధిష్టానం సూచించిన ఇద్దరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇస్తామని గతంలోనే హామీ ఇచ్చినట్లు ప్రచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement